Bank loans: రుణాలపై కూడా దీపావళి ఆఫర్లు.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ

పండగలను ఘనంగా జరుపుకోవడం భారతీయుల సంప్రదాయం. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అలాగే పండగల సమయంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. కొత్త ఇల్లు, కారు, ఇంటిలోకి అవసరమైన వస్తువులను ఈ సమయంలోనే కొనుగోలు చేస్తారు. తద్వారా పండగ ఆనందం రెట్టింపు కావడంతో పాటు కొన్న వస్తువులు కలకాలం గుర్తుంటాయి.

Bank loans: రుణాలపై కూడా దీపావళి ఆఫర్లు.. ఆ బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ
Money Astrology
Follow us

|

Updated on: Nov 01, 2024 | 2:40 PM

భారతీయుల ఆనవాయితీకి అనుగుణంగా బ్యాంకులు కూడా దీపావళి, ధన్ తేరాస్ సందర్భంగా రుణాలు అందిస్తున్నాయి. ఇల్లు కొనాలన్నా, కారు కొనుగోలు చేయాలన్నా, ఫిక్స్ డ్ డిపాజిట్లలో పొదుపు చేయాలన్నా ఇదే మంచి అవకాశం. వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలు, వాటిపై విధిస్తున్న వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

బ్యాంకు ఆఫ్ బరోడా

  • బ్యాంకు ఆఫ్ బరోడా లో హోమ్ లోన్లపై 8.40 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయరు.
  • కొత్త కారును కొనుగోలు చేయడానికి ఇచ్చే రుణాలపై 8.95 శాతం వడ్డీ విధిస్తున్నారు. దీనిపై ప్రాసెసింగ్ చార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
  • వ్యక్తి గత రుణాలకు 10.80 శాతం వడ్డీ రేటు ఉంటుంది. మహిళలకైతే 10.55 శాతం వసూలు చేస్తారు 84 నెలల వరకూ ప్రాసెసింగ్ ఫీజు, రీపేమెంట్ ఎంపికలు ఉండవు.
  • బీఓబీ ఉత్సవ్ డిపాజిట్ స్కీమ్ లో సాధారణకు ఖాతాదారులకు 7.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీ అందిస్తారు.

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర

  • దీపావళి సందర్బంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హోమ్ రుణాలు మంజూరు చేస్తున్నారు. వీటిపై 8.35 శాతం వడ్డీ విధిస్తున్నారు.
  • కారు రుణాలపై 8.70 శాతం వడ్డీని విధిస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయరు.

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ద్వారా హోమ్ రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం తగ్గింపు ఉంటుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)

హోమ్ రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయడం లేదు. వ్యక్తి గత, కారు రుణాలపై కూడా చార్జీలు తీసుకోవడం లేదు. అయితే వివిధ రుణ ఉత్పత్తులకు ప్రత్యేక వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి

ఇండియన్ బ్యాంక్

ఈ బ్యాంకులో ఐఎన్ డీ సూపర్ 300 డేస్ స్కీమ్ అమలవుతోంది. దీనిపై డిపాజిట్లకు 7.05 శాతం వడ్డీ అందిస్తున్నారు. అలాగే ఐఎన్ డీ సూపర్ 400 డేస్ స్కీమ్ లో 7.30 శాతం వడ్డీ అందిస్తారు. ఇక సీనియర్ సిటిజన్లకు మరో 0.50 శాతం, సూపర్ సీనియర్లకు 0.75 శాతం అదనపు వడ్డీ ఉంటుంది.

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్

  • ఈ బ్యాంకులో హోమ్ రుణాలపై 8.45 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ చార్జీలు లేవు.
  • వాహన రుణాలలపై 8.64 శాతం వడ్డీ విధిస్తారు. వీటికి కూడా ప్రాసెసింగ్ చార్జీలు లేవు.
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • హోమ్ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేవు. వడ్డీరేట్లు 8.35 శాతం నుంచి మొదలవుతాయి.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు

  • కారు రుణాలపై ఎలాంటి జప్తు చార్జీలు ఉండవు. వడ్డీరేటు 9.25 నుంచి ప్రారంభమవుతుంది.
  • 2 సంవత్సరాల 11 నెలల ఫిక్స్ డ్ డిపాజిట్లపై 7.35 శాతం, నాలుగేళ్ల 7 నెలలకు 7.40 శాతం వడ్డీ అందిస్తున్నారు. సీనియర్ల సిటిజన్లకు దీనికి అదనంగా మరో 0.50 శాతం ఇస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి