Digital Loans: లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకున్నారా?ఈ రూల్స్ తెలుసా?
ఫైనాన్షియల్ ప్లానర్ నేమా ఛాయా బక్ ప్రకారం.. స్వల్పకాలిక తక్షణ రుణాలు సులభంగా అందుబాటులో ఉంటాయని, అయితే జాగ్రత్తగా పరిశీలించకుండా వాటి కోసం దరఖాస్తు చేయకూడదని సలహా ఇచ్చారు. మీకు ఇతర ఆప్షన్స్ లేనప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే ఇటువంటి రుణాలను ఎంచుకోండి. అలాగే, రుణం మొత్తం ఎక్కువగా ఉండకపోవడం మంచిది. వడ్డీ రేటును తనిఖీ చేయాలి, క్రెడిట్ చరిత్రను అంచనా వేయాలి..
కోవిడ్ మహమ్మారి సమయంలో తక్షణ రుణాలను అందించే అనేక యాప్‌లు భారతదేశంలో పుట్టుకొచ్చాయి. కోవిడ్ వల్ల ఎదుర్కొంటున్న సవాళ్లు, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజలు ఈ యాప్‌లపై ఆధారపడుతున్నారు. 2012లో డిజిటల్ లెండింగ్ మార్కెట్ విలువ 9 బిలియన్ డాలర్లు మాత్రమే కాగా, 2020లో అది 150 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇది 15 రెట్లు ఎక్కువ పెరిగింది. దీనిని బట్టి దేశంలో ఈ యాప్‌లకు ఉన్న జనాదరణను అంచనా వేయవచ్చు. ఇది 2023 చివరి నాటికి దాదాపు 350 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
ఫిన్‌టెక్ అసోసియేషన్ ఫర్ కన్స్యూమర్ ఎంపవర్‌మెంట్… అంటే FACE నుండి వచ్చిన నివేదిక ప్రకారం, భారతదేశంలో డిజిటల్ లెండింగ్ మార్కెట్ స్థిరంగా పెరుగుతోంది. FY23లో, 92,848 కోట్ల రూపాయల డిజిటల్ రుణాలు పంపిణీ చేశారు. అంతకు ముందు సంవత్సరంలో దీని విలువ కేవలం 35,490 కోట్ల రూపాయలు మాత్రమే.
జెనరేషన్ Z, అంటే 1996 తర్వాత జన్మించిన వ్యక్తులు ఈ డిజిటల్ లోన్‌లలో ముందంజలో ఉన్నారు. ఈ తరం బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లడనికి ఇష్టపడడం లేదు. అప్పు తీసుకోవడానికి సుదీర్ఘమైన పేపర్ వర్క్‌ని నచ్చడం లేదు. డిజిటల్ లోన్‌లను వారి ఇళ్ల నుండి సులభంగా యాక్సెస్ చేయవచ్చు. అందుకే ఈ తరం ఇలాంటి రుణాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
పూర్ క్రెడిట్ హిస్టరీ లేదా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న వ్యక్తులు, సాంప్రదాయ బ్యాంకుల నుండి రుణాలను పొందడం కష్టం. వారు డిజిటల్ లోన్‌లను ఎంచుకుంటారు. ఈ కారణాల వల్ల డిజిటల్ లోన్‌లు వేగంగా జనాదరణ పొందుతున్నాయి. డిజిటల్ లోన్‌ని పొందే ముందు దాని నిబంధనలు, షరతులను పూర్తిగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే డిజిటల్ లోన్ పొందడం సులభమే అయినా, దాని వల్ల వచ్చే సమస్యల నుంచి తప్పించుకోవడం చాలా పెద్ద సవాల్ అని చెప్పాలి.
FREED వ్యవస్థాపకుడు, రితేష్ శ్రీవాస్తవ్ ప్రకారం, “డిజిటల్ రుణాలు ప్రమాదకరం ఎందుకంటే భారతదేశంలో ఈ రుణాల వార్షిక శాతం రేటు లేదా APR.. 36 నుండి 48 శాతం వరకు ఉంటుంది. అంటే ప్రతి 100 రూపాయల రుణంపై, మీరు 48 రూపాయల వరకు వార్షిక వడ్డీని చెల్లించాల్సి రావచ్చు. ఒకవేళ మీరు చెల్లింపులు సరిగా చేయనట్లయితే… అప్పిచ్చినవారు, వారి ఏజెంట్లు మిమ్మల్ని ఫోన్ కాల్స్, మెసేజ్ లతో నిరంతరం ఇబ్బంది పెట్టవచ్చు.”
ఫైనాన్షియల్ ప్లానర్ నేమా ఛాయా బక్ ప్రకారం.. స్వల్పకాలిక తక్షణ రుణాలు సులభంగా అందుబాటులో ఉంటాయని, అయితే జాగ్రత్తగా పరిశీలించకుండా వాటి కోసం దరఖాస్తు చేయకూడదని సలహా ఇచ్చారు. మీకు ఇతర ఆప్షన్స్ లేనప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే ఇటువంటి రుణాలను ఎంచుకోండి. అలాగే, రుణం మొత్తం ఎక్కువగా ఉండకపోవడం మంచిది. వడ్డీ రేటును తనిఖీ చేయాలి, క్రెడిట్ చరిత్రను అంచనా వేయాలి. తిరిగి చెల్లించే వ్యవధిని కూడా చెక్ చేయాలి. ఆపై మీరు అలాంటి రుణాలను తీసుకోవచ్చో లేదో నిర్ణయించుకోవాలి. తక్షణ రుణం కోసం దరఖాస్తు చేసే ముందు, రిస్క్‌లను క్షుణ్ణంగా అంచనా వేయాలి. ఎందుకంటే తర్వాత ఇది చాలా పెద్ద మార్పులకు దారి తీయవచ్చు.
మీరు డిజిటల్ లోన్ తీసుకున్నప్పుడల్లా, కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. ముందుగా మీరు రుణం తీసుకుంటున్న ఎంటిటీ నియంత్రణలో ఉందని నిర్ధారించుకోండి. ఇది బ్యాంక్ లేదా NBFC వంటి నియంత్రిత సంస్థ అయితే, అక్కడ నుండి రుణం తీసుకోవడం సురక్షితం. నియంత్రిత సంస్థ అంటే అది RBI నియంత్రణలో ఉండాలి. కస్టమర్ దృష్టికోణంలో Google Play Storeలో రేటింగ్‌లను కూడా తనిఖీ చేయాలి. ఇది ఆ యాప్‌లను ఫిల్టర్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే డిజిటల్ లోన్ తీసుకోండి. లేకపోతే, దానికి దూరంగా ఉండడమే మంచిది.
ఇన్ స్టంట్ లోన్స్ ను గుడ్డిగా తీసుకోకూడదు. ఇతర ప్రత్యామ్నాయాలు లేనప్పుడు మాత్రమే అటువంటి రుణాలను ఎంచుకోండి. లోన్ మొత్తం చాలా ఎక్కువగా ఉండకూడదని గుర్తుంచుకోండి. తక్షణ రుణం తీసుకునే ముందు అందులో ఉన్న నష్టాలను పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని ఫైనాన్షియల్ ప్లానర్ నేమా ఛాయబక్ అంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి