Personal Loan: కరోనా కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి శుభవార్త చెబుతోంది డిజిటల్ లెండింగ్ ఫ్లాట్‌ఫామ్ క్యాష్ సంస్థ. ఇన్‌స్టంట్ క్రెడిట్ అందిస్తోంది. రూ.10 వేల నుంచి రూ.4 లక్షల వరకు క్షణాల్లోనే రుణాలు అందిస్తోంది. యూజర్ ప్రొఫైల్‌ను బట్టి లోన్ లిమిట్ అందిస్తోంది. యూజర్లకు మంజూరు చేసి మొత్తంలో ఎంతైనా వాడుకునే అవకాశం ఉంటుంది. కావాల్సిన రుణం నేరుగా బ్యాంకు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కస్టమర్లు నిర్ణీత కాలంలో వడ్డీతో స హా లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బయ్ నౌ పే లేటర్ ఆప్షన్ కూడా ఉంది. ఇందు కోసం క్యాష్ (Cash) సంస్థ అమెజాన్, మింత్రా, బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, ఊబెర్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చినట్లే కస్టమర్లకు లోన్ లిమిట్ వస్తుంది. అందులో అవరం ఉన్నంత కస్టమర్లు వాడుకోవచ్చు. వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఎక్కువ లోన్ వచ్చినా ఎంత వాడుకుంటే అంతా మొత్తానికే వడ్డీ వర్తిస్తుంది. రుణం తీసుకున్న కస్టమర్లు ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. యాప్ ద్వారా లోన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ చెక్ చేసి లోన్ మంజూరు చేస్తుంది. ఈ సంస్థ. ఇలా క్షణాల్లో రుణం మంజూరు చేస్తూన్న ఈ సంస్థకు సకాలంలో చెల్లిస్తే బాగుంటుంది. ఇలాంటి రుణం ఇలాంటి కరోనా సంక్షోభంలో ఎంతగానే ఉపయోగపడుతుంది. ఇలాంటి రుణాలను తీసుకునేందుకు చాలా మందే వస్తుంటారు.