Metro -Local Trains: మెట్రో, లోకల్ రైలు మధ్య తేడా ఏమిటి? వీటి ప్రయోజనాలు ఏంటి?

|

Feb 10, 2024 | 12:30 PM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే రైల్వే వ్యవస్థలో లోక్‌ రైళ్లు, మెట్రో రైళ్లు ఉన్నాయి. ఈ రెండింటిలో తేడాలు ఉన్నాయి. ఈ మధ్య కాలం నుంచి ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే లోక్‌ రైళ్ల వ్యవస్థ సిటీతో పాటు ఇతర ప్రాంతాలను కలుపుతూ ఉండగా, మెట్రో రైళ్లు సిటీ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. రెండింటిలో తేడాలు ఉన్నాయి. మెట్రో సిటీలో తక్కువ దూరంలో ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. ..

Metro -Local Trains: మెట్రో, లోకల్ రైలు మధ్య తేడా ఏమిటి? వీటి ప్రయోజనాలు ఏంటి?
Metro Local Train
Follow us on

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అది రైల్వే అని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి రోజు లక్షలాది రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే రైల్వే వ్యవస్థలో లోక్‌ రైళ్లు, మెట్రో రైళ్లు ఉన్నాయి. ఈ రెండింటిలో తేడాలు ఉన్నాయి. ఈ మధ్య కాలం నుంచి ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే లోక్‌ రైళ్ల వ్యవస్థ సిటీతో పాటు ఇతర ప్రాంతాలను కలుపుతూ ఉండగా, మెట్రో రైళ్లు సిటీ ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. రెండింటిలో తేడాలు ఉన్నాయి. మెట్రో సిటీలో తక్కువ దూరంలో ప్రయాణించేందుకు అనువుగా ఉంటుంది. అదే లోకల్‌ ట్రైన్లు సిటీతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువుగా ఉంటుంది.  మీలో చాలామంది ముంబై లోకల్ రైలు, ఢిల్లీ, హైదరాబాద్‌ ఇతర రాష్ట్రాల్లో మెట్రో రైలు పేరు విని ఉంటారు. సిటీ వాసులకు మెట్రో రైళ్లు చాలా ముఖ్యం. లోకల్‌ రైళ్లు కూడా సిటీ వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారికి చాలా ముఖ్యం. అందుకే రెండు రకాల రైళ్లు కూడా ముఖ్యమే. ఈ రెండు రకాల రైళ్ల మధ్య చాలా తేడాలు ఉన్నాయి.

లోకల్ ట్రైన్: లోకల్ ట్రైన్ అనేది నగరంలో దూరాలకు ప్రయాణించడానికి, దాని శివారు ప్రాంతాలను కలిపే ప్రభావవంతమైన రవాణా విధానం. స్థానిక రైళ్లకు వాటి కార్యకలాపాల కోసం ప్రత్యేక ట్రాక్ లేదు. ఎందుకంటే వాటి ట్రాక్‌లను సరుకు రవాణా రైళ్లు, ఇతర ప్యాసింజర్ రైళ్లు కూడా ఉపయోగిస్తాయి.

మెట్రో రైలు: ఈ రైలును రోజువారీ ప్రయాణికులు తక్కువ దూరం లేదా సిటీ పరిధిలోని దూరాన్ని కవర్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఇది భారతదేశంలోని రైళ్ల కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు లోకల్ రైలు, మెట్రో రైలు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి
  1. మెట్రో రైలు అనేది మెట్రోపాలిటన్ నగరాల్లో నడపడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన రైలు. అయితే లోకల్ రైళ్లు నగరం, దాని శివారు ప్రాంతాలలోని దూరాలను అనుసంధానించేలా రూపొందించబడ్డాయి.
  2. మెట్రో రైళ్లు ప్రత్యేక ట్రాక్‌ను కలిగి ఉంటాయి. ఇది ఇతర రైళ్లతో భాగస్వామ్యం చేయడానికి అవకాశం ఉండదు. అయితే స్థానిక రైళ్లు తమ మార్గాన్ని సరుకు రవాణా రైళ్లు, ఇతర ప్యాసింజర్ రైళ్లు వంటి ఇతర రైళ్లతో పంచుకోవాలి.
  3. కోల్‌కతా మెట్రో భారతదేశంలో మొదటి మెట్రో. 1984లో కోల్‌కతాలో తొలి మెట్రో సర్వీసును మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు. మరోవైపు లోకల్ రైళ్లు 1853 నుంచి నడుస్తున్నాయి.
  4. మెట్రో రైళ్లతో పోలిస్తే లోకల్ రైళ్లలో ఎక్కువ సీట్లు ఉంటాయి.
  5. మెట్రో రైళ్లు అండర్ గ్రౌండ్, ఎలివేట్ చేయవచ్చు. కానీ అన్ని లోకల్ రైళ్లు నేలపై మాత్రమే నడుస్తున్నాయి.
  6. మెట్రో రైళ్ల కంటే లోకల్ రైళ్లు ప్రయాణించే దూరం ఎక్కువ.
  7. లోకల్ రైళ్లతో పోలిస్తే మెట్రో రైలు ఛార్జీలు ఎక్కువ.
  8. ప్రస్తుతానికి దేశంలో మెట్రో నెట్‌వర్క్‌ కంటే లోకల్‌ రైలు నెట్‌వర్క్‌ ఎక్కువగా ఉంది.
  9. మెట్రో రైళ్లలో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. అయితే లోకల్ రైళ్లలో ఇంత ఫ్రీక్వెన్సీ ఉండదు. ఎందుకంటే సుదీర్ఘ విరామంలో నడుస్తుంది కాబట్టి.
  10. లోకల్ రైళ్ల నిర్వహణ పూర్తిగా రైల్వే మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే నిర్వహించడం జరుగుతుంది. అదే మెట్రో రైలు నిర్వహణలో ఎక్కువ భాగం రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ మినిస్ట్రీ మెట్రో అధికారులచే నిర్వహన కొనసాగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి