Business credit cards: వ్యాపార అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులున్నాయని తెలుసా? ప్రత్యేకతలు ఏంటంటే?

|

Aug 07, 2024 | 7:24 PM

క్రెడిట్ కార్డు అనేది నేడు అందరికీ అత్యంత అవసరంగా మారింది. అత్యవసర సమయంలో మనకు ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వివిధ బిల్లులు చెల్లించవచ్చు. షాపింగ్ చేయవచ్చు, కావాల్సిన వస్తువులను నెలవారీ వాయిదాల రూపంలో కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులందరికీ ఈ కార్డులను అందజేస్తాయి. క్రెడిట్ కార్డులలో అనేక రకాలు ఉన్నాయి. మన అవసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు.

Business credit cards: వ్యాపార అవసరాలకు కూడా క్రెడిట్ కార్డులున్నాయని తెలుసా? ప్రత్యేకతలు ఏంటంటే?
Credit Card
Follow us on

క్రెడిట్ కార్డు అనేది నేడు అందరికీ అత్యంత అవసరంగా మారింది. అత్యవసర సమయంలో మనకు ఆర్థిక సాధనంగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా వివిధ బిల్లులు చెల్లించవచ్చు. షాపింగ్ చేయవచ్చు, కావాల్సిన వస్తువులను నెలవారీ వాయిదాల రూపంలో కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అన్ని బ్యాంకులు తమ ఖాతాదారులందరికీ ఈ కార్డులను అందజేస్తాయి. క్రెడిట్ కార్డులలో అనేక రకాలు ఉన్నాయి. మన అవసరాలకు అనుగుణంగా వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపార ఖర్చులను నిర్వహించడానికి వ్యాపార క్రెడిట్ కార్డులను ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి వ్యక్తిగత కార్డుల మాదిరిగానే ఉంటాయి. వ్యాపార క్రెడిట్ కార్డులలో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని చిన్న వ్యాపార కార్డులు, కార్పొరేట్ కార్డులుగా విభజించారు. పేరుకు తగ్గట్టుగానే చిన్న బిజినెస్ కార్డులను స్టార్టప్, చిన్న సంస్థల కోసం రూపొందించారు. కార్పొరేట్ కార్డులను పెద్ద కంపెనీలకు మంజూరు చేస్తారు. ఈ నేపథ్యంలో బిజినెస్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందాం.

బిజినెస్ క్రెడిట్ కార్డుల వల్ల లాభాలు

  •  బిజినెస్ క్రెడిట్ కార్డుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార ఖర్చులు నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడతాయి. మీరు వ్యాపారం చేస్తున్నా, స్వయం ఉపాధి పొందుతున్నా, ఫ్రీలాన్సర్‌గా పని చేస్తున్నా బిజినెస్ క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.
  • కంపెనీకి మంచి క్రెడిట్ చరిత్రను నిర్మించడానికి వ్యాపార క్రెడిట్ కార్డు సహాయపడుతుంది. రుణాలు తదితర ఆర్ఠిక సంబంధ కార్యక్రమాలకు మంచి క్రెడిట్ స్కోర్ చాలా అవసరం.
  • వ్యాపారానికి డబ్బు అనేది చాలా అవసరం. బిజినెస్ క్రెడిట్ కార్డు మీకు ఆ విషయంలో ఎంతో ఉపయోగపడుతుంది. మీ వ్యాపారానికి కార్డుల ద్వారా నగదును సమకూర్చుకుని వ్యాపార కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించవచ్చు. అలాగే వ్యాపారం ఎక్కువగా ఉంటే అధిక క్రెడిట్ లిమిట్ పెరుగుతుంది. అందువల్ల వ్యాపార పెట్టుబడులకు ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

వివిధ బ్యాంకుల  బిజినెస్ కార్డులివే

ఎస్బీఐ ప్లాటినం కార్పొరేట్ క్రెడిట్ కార్డు

ఈ కార్డుకు వార్షిక రుసుము లేదు. వ్యాపారస్తులకు బాగా ఉపయోగపడుతుంది. తక్కువ ఖర్చులో ఉత్తమ కార్డుగా ఉంటుందని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ బిజినెస్ అడ్వాంటేజ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డును వినియోగించుకున్నందుకు వార్షిక రుసుముగా రూ.వెయ్యి చెల్లించాలి. దీని ద్వారా వ్యాపార ఖర్చులపై క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. రోజువారీ ఖర్చులను ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

హెచ్‌డీఎఫ్‌సీ బిజినెస్ మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్

టెలికాం, విద్యుత్, ప్రభుత్వం/పన్ను, రైల్వే, హోటళ్లు, టాక్సీ తదితర ఖర్చులను ఈ కార్డు ద్వారా చేస్తే ఐదుశాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. దీనికి వార్షిక రుసుముగా రూ.వెయ్యి చెల్లించాలి.

యాక్సిస్ బ్యాంక్ మై బిజినెస్ క్రెడిట్ కార్డ్

ఈ కార్డుకు వార్షిక రుసుముగా రూ.499 వసూలు చేస్తారు. లావాదేవీలకు సంబంధించి ఈడీజీఈ లాయల్టీ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. 500 కంటే ఎక్కువ రివార్డ్‌లకు యాక్సెస్, పాయింట్లను రీడీమ్ చేయడం కోసం ఆఫర్లు కూడా ప్రకటించారు.

కోటక్ కార్పొరేట్ గోల్డ్ క్రెడిట్ కార్డు

ఈ కార్డు వినియోగదారులు వార్షిక రుసుముగా రూ.వెయ్యి చెల్లించాలి. ప్రతి త్రైమాసికంలో రీడీమ్ చేసుకునేలా ప్రత్యేక పాయింట్లను అందిస్తారు. ఈ పాయింట్ల ద్వారా వివిధ ప్రయోజనాలను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి