Mother Dairy: సామాన్యుడికి షాక్.. అమూల్ బాటలో మదర్ డెయిరీ.. పాల ధరను పెంచుతూ నిర్ణయం
ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యవసర సరుకులతో పాటు వివిధ రకాల వస్తువుల ధరలు ఎగబాకుతున్నాయి. ఇక ప్రతి రోజు అవసరం ఉండే పాల ధరలు సైతం పెరిగిపోతున్నాయి..

ప్రస్తుతం అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి. నిత్యవసర సరుకులతో పాటు వివిధ రకాల వస్తువుల ధరలు ఎగబాకుతున్నాయి. ఇక ప్రతి రోజు అవసరం ఉండే పాల ధరలు సైతం పెరిగిపోతున్నాయి. అమూల్ తర్వాత ఇప్పుడు మదర్ డెయిరీ కూడా పాల ధరను పెంచింది. మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఫుల్ క్రీమ్ మిల్క్, ఆవు పాల ధరలను లీటరుకు 2 రూపాయలు పెంచింది. ఈ సందర్భంగా మదర్ డెయిరీ ప్రతినిధి మాట్లాడుతూ.. ఫుల్ మీగడ, ఆవు పాల ధరలను మాత్రమే రూ.2 పెంచుతున్నామని తెలిపారు. ఈ పెరిగిన ధరలు అక్టోబర్ 16 నుండి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇప్పుడు మదర్ డెయిరీ కూడా ధరల పెరుగుదలతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడక తప్పదు.
అంతకుముందు శనివారం ఉదయం అమూల్ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయించే జీసీఎంఎంఎఫ్, అమూల్ గోల్డ్, గేదె పాలపై లీటరుకు 2 రూపాయలు పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జిసిఎంఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ అమూల్ గోల్డ్, గేదె పాలను లీటరుకు రెండు రూపాయలు పెంచారు. గుజరాత్ మినహా దేశంలోని అన్ని మార్కెట్లలో ఈ ధర పెరుగుదల జరిగింది.
అమూల్ రోజుకు 150 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తోంది:
కొవ్వు ధరలు పెరగడం వల్లే ఈ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు ఆర్ఎస్ సోధి తెలిపారు. జీసీఎంఎంఎఫ్ అంతకుముందు ఆగస్టు 17న కూడా పాల సేకరణ వ్యయం పెరుగుతోందని పేర్కొంటూ తన ఉత్పత్తుల ధరలను లీటరుకు రూ.2 పెంచింది. ప్రధానంగా గుజరాత్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ బెంగాల్, ముంబైలలో పాలను విక్రయిస్తుంది. రోజుకు 150 లక్షల లీటర్లకు పైగా పాలను విక్రయిస్తోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మార్కెట్‌లో దాదాపు 40 లక్షల లీటర్లు విక్రయిస్తోంది.
అమూల్ పాల ధర లీటర్ రూ.63కి పెరిగింది
ఈ సమయంలో పండుగల సీజన్ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమూల్, మదర్ డెయిరీ ధరలు పెంచడం వల్ల వినియోగదారుల జేబులకు చిల్లు పడటం ఖాయం. ఢిల్లీ ప్రాంతంలో పాల ధరలను అమూల్ రూ.2 పెంచింది. ఇప్పుడు ఢిల్లీలో లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.63కి పెరిగింది. అంతకుముందు ఆగస్టులో కూడా పాల ధరలను పెంచారు. శుక్రవారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల ప్రకారం, పశుగ్రాసం ద్రవ్యోల్బణం తొమ్మిదేళ్లుగా రికార్డు స్థాయికి దగ్గరగా 25 శాతానికి పైగా ఉంది. దీంతో పాల ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ధరలను సాకుగా చూపుతూ అమూల్ ధరలను పెంచుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి