SBI: మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మోసాలు పెరిగిపోతున్నాయి. కొన్ని పద్దతులను పాటించడం వల్ల మోసాలను తగ్గించుకోవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఇటీవల కస్టమర్లకు డిజిటల్ భద్రతకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. దీని వల్ల వినియోగదారులు సురక్షితమైన లావాదేవీలు చేయవచ్చు. ఆర్థిక భద్రత చాలా ముఖ్యమైనది కాబట్టి, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించడంపై SBI కొన్ని భద్రతా చిట్కాలను అందించింది. SBI డెబిట్, క్రెడిట్ కార్డ్ సెక్యూరిటీ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
ఈ భద్రతా చిట్కాలు:
☛ ATM లేదా POS లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
☛ఏటీఎంలలో కీప్యాడ్‌పై పిన్‌ను నమోదు చేస్తున్నప్పుడు ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్తగా నమోదు చేయాలి.
☛ ఏదైనా లావాదేవీ చేయడానికి ముందు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌ల ప్రామాణికతను ధృవీకరించండి.
☛ ఇది కాకుండా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా మీ డెబిట్ కార్డ్ లావాదేవీలను నిర్వహించండి.
☛ మీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, POS, ATMలలో దేశీయ, అంతర్జాతీయ లావాదేవీల కోసం కార్డ్ లావాదేవీల పరిమితిని సెట్ చేయండి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌ల కోసం మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఇప్పుడు గ్రామీణ బ్యాంకులు కూడా క్రెడిట్ కార్డులను జారీ చేయవచ్చు. అయితే ఇందుకోసం గ్రామీణ బ్యాంకు స్పాన్సర్ బ్యాంక్‌తో ఒప్పందం చేసుకోవాలి. అర్బన్ కో-ఆపరేటివ్ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటే వారు క్రెడిట్ కార్డులను కూడా జారీ చేయవచ్చు. రానున్న రోజుల్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు అంటే ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ అనుమతించవచ్చని మాస్టర్ సర్క్యులర్ సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఒక NBFC క్రెడిట్ కార్డ్ జారీ చేయాలనుకుంటే దానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం అవసరం. రిజర్వ్ బ్యాంక్ కొత్త సర్క్యులర్ అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు వర్తిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్‌కు సంబంధించి పర్సనల్ ఫైనాన్స్ యాప్ బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ సుచేతా మహపాత్ర మాట్లాడుతూ.. ఆర్‌బిఐ నిర్ణయం పారదర్శకతను పెంచుతుందని, ఇది కస్టమర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: