Credit Cards Fee: ఇక క్రెడిట్ కార్డ్ వాడే వారి జేబుకు బొక్కే.. బిల్లు చెల్లింపుల్లో ఆలస్యమైతే బాదుడే బాదుడు
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఛార్జీలు మీకు తెలుసా? ఎందుకంటే జూన్ 1, 2024 నుండి వివిధ క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు తమ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, చెల్లింపు సిస్టమ్‌లలో మార్పులు అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్..
దేశంలోని అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ బ్యాంకులు ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ సహా బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఛార్జీలు మీకు తెలుసా? ఎందుకంటే జూన్ 1, 2024 నుండి వివిధ క్రెడిట్ కార్డ్ జారీ చేసేవారు తమ రివార్డ్ ప్రోగ్రామ్‌లు, చెల్లింపు సిస్టమ్‌లలో మార్పులు అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో యాక్సిస్ బ్యాంక్ మాగ్నస్ క్రెడిట్ కార్డ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయ లాంజ్‌లు, ప్రత్యేకమైన డైనింగ్ ఆఫర్‌లు, మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. కార్డ్ హోల్డర్లు భారతదేశంలోని ది ఒబెరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్, ట్రైడెంట్ హోటల్స్‌లో 15% తగ్గింపును పొందవచ్చు. దేశవ్యాప్తంగా 4,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో 40% వరకు తగ్గింపు పొందవచ్చు. ఇది రూ.5 లక్షల వరకు సమగ్ర కవర్, 2% విదేశీ మారకపు మార్కప్ ఛార్జీని కూడా అందిస్తుంది.
మరి క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైతే ఏ బ్యాంకు ఎటువంటి ఛార్జీలు విధిస్తాయో చూద్దాం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా:
- జూన్ 2024 నుండి దేశంలోని ప్రముఖ క్రెడిట్ కార్డ్ జారీదారు ఎస్‌బీఐ కార్డ్, నిర్దిష్ట క్రెడిట్ కార్డ్‌ల కోసం ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై రివార్డ్ పాయింట్‌లను అందించదు.
- ఎస్‌బీఐ బ్యాంక్ రూ.400 వరకు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు లేవు.
- రూ.500-1000 లావాదేవీ బ్యాలెన్స్‌కు ఆలస్య రుసుముగా రూ.400 వసూలు చేస్తారు.
- రూ.1000-రూ.10000 లావాదేవీ బ్యాలెన్స్‌కు రూ.750 విధిస్తారు.
- లావాదేవీ ఆలస్యం రుసుము రూ.10000-రూ.25000కి రూ.950 విధిస్తారు.
- రూ.25,000-రూ.50,000 లావాదేవీ బ్యాలెన్స్ రూ.1100గా వసూలు చేస్తారు.
- రూ.50000 కంటే ఎక్కువ నిల్వలకు రూ.1300 ఛార్జీ విధిస్తారు.
యాక్సిస్ బ్యాంక్:
- యాక్సిస్ బ్యాంక్ ప్రతి అద్దె లావాదేవీపై 1% అద్దె సర్‌ఛార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దీని సీలింగ్ రూ.1500. ఇందులో పన్నులను భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది. భారత కరెన్సీ అంతర్జాతీయంగా ఉపయోగించబడుతుంది.
- అలాగే, విదేశాల్లో నమోదైన భారతీయ వ్యాపారులు పాల్గొన్న ఏదైనా అంతర్జాతీయ లావాదేవీ లేదా భారతీయ కరెన్సీ లావాదేవీలపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) మార్కప్ 1%, పన్నులు విధించబడతాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
- ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. 1 ఏప్రిల్ 2024 నుండి రూ.35 వేలు ఖర్చు చేయడం ద్వారా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌ని ఆస్వాదించవచ్చు.
క్రెడిట్ కార్డ్ ఛార్జీలు:
- రూ.100 నుంచి రూ.550 మధ్య రూ.100 రుసుము వసూలు చేస్తారు.
- రూ.501-రూ.5,000 రుసుముగా రూ.500 వసూలు.
- రూ.5,001 నుంచి రూ.10,000 వరకు రూ.750 ఫీజుగా వసూలు చేస్తారు.
- రూ.10,001-రూ.25,000 రుసుము రూ.900 వసూలు చేస్తారు.
- రూ.25001 నుండి రూ.50,000 వరకు రూ.1000వసూలు చేస్తారు.
- రూ.50 వేలకుపైగా రూ.1200 వసూలు చేస్తారు.
హెచ్‌ఎఫ్‌సీ బ్యాంక్
- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి సంబంధించి రూ.100-500కి రూ.100 రుసుము వసూలు చేస్తారు.
- రూ.501-5000 వరకు రుసుము రూ.500 వసూలు చేస్తారు.
- రూ.5001-10,000 మధ్య లావాదేవీలకు రూ.600 ఆలస్య రుసుము విధిస్తారు.
- రూ.1,000-25,000 వరకు రూ.800 వసూలు చేస్తారు.
- రూ.25001-50000 మధ్య లావాదేవీలకు రూ.1100 ఆలస్య రుసుము విధిస్తారు.
- రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీలకు రూ.1300 ఆలస్య రీపేమెంట్ రుసుము వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి