Craftsman Automation: ఈనెల 15 నుంచి 17 వరకు రెండు ఐపీఓలు.. రూ. 1400 కోట్ల సమీకరణ

|

Mar 10, 2021 | 5:44 PM

Craftsman Automation: ఈనెల 15న రెండు కంపెనీల ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ )లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో ఆటోమొబైల్‌ విడి భాగాల తయారీ కంపెనీ క్రాఫ్ట్‌మాన్‌ ...

Craftsman Automation: ఈనెల 15 నుంచి 17 వరకు రెండు ఐపీఓలు.. రూ. 1400 కోట్ల సమీకరణ
Follow us on

Craftsman Automation: ఈనెల 15న రెండు కంపెనీల ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ )లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో ఆటోమొబైల్‌ విడి భాగాల తయారీ కంపెనీ క్రాఫ్ట్‌మాన్‌ ఆటోమేషన్‌ రూ.824 కోట్లు, లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రూ.600 కోట్లు సమీకరించబోతున్నాయి. క్రాఫ్ట్‌మాన్‌ ఆటోమేషన్‌ కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.1,488-1,490గా, లక్ష్మీ ఆర్గానిక్‌ రూ.129-130 గా నిర్ణయించాయి. ఈ రెండు ఇష్యూల సబ్‌స్ర్కిప్షన్‌ మార్చి 17తో ముగియనుంది.

కాగా, రక్షణ, అంతరిక్ష రంగాలకు సేవలందిస్తున్న పరాస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ కంపెనీ ఐపీఓకు రెడీ అవుతోంది. ఇందు కోసం సెబికీ అవసరమైన ప్రాథమిక పత్రాలు సమర్పించింది. ఈ ఐపీఓ ద్వా రా రూ.120 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

స్పెషాలిటీ కెమికల్స్‌ తయారు చేసే లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌కు చైనా, నెదర్లాండ్స్‌, రష్యా, సింగపూర్‌, యునైటెడ్‌ అరబ్‌, ఎమిరేట్స్‌, బ్రిటన్‌, అమెరికా సహా 30 దేశాల్లో వినియోగదారులు ఉన్నారు. అలాగే క్రాఫ్ట్స్‌మన్‌ ఆటోయేషన్‌.. వాహన విడిభాగాలను తయారు చేసే ఈ సంస్థ కోయంబత్తూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే పబ్లిక్‌ ఇష్యూకు పారస్‌ డిఫెన్స్‌.. మొదటి పబ్లిక్‌ ఆఫర్‌కు అనుమతి కోరుతూ సెబీకి సంబంధిత పత్రాలను పారస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ సమర్పించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.120 కోట్ల విలువైన కొత్త షేర్లతో పాటు ప్రమోటర్లు, ప్రస్తుతం వాటాదారులకు చెందిన 17,24,490 షేర్లు విక్రయించాలని భావిస్తోంది.

Decompose: భూమిలో కలిసిపోయేందుకు ఏ వస్తువుకు ఎంత కాలం పడుతుందో తెలిస్తే ఆశ్యర్యపోవాల్సిందే..!

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!