Business Idea: ఈ చిన్న వ్యాపారంతో భారీగా లాభాలు.. నష్టం అనేదే ఉండదు..
ప్రస్తుతం కాటన్ బడ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో నివసించే వారే ఇలాంటి వాటిని ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రజలు కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే ఈ వ్యాపారంలో పెద్దగా నష్టాలు ఉండవు. అంతేకాకుండా ఔత్సాహితక యువతను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న..

ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా యువత ఆలోచనలు మారుతున్నాయి. ఒకరి దగ్గర ఉద్యోగం చేసేకంటే తామే నలుగురికి ఉద్యోగాలు ఇవ్వాలనే ధోరణి పెరుగుతోంది. దీంతో స్టార్టప్‌లను ఏర్పాటు చేస్తూ తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అయితే వ్యాపారం అనగానే చాలా మంది నష్టాలు వస్తాయేమో అనే ఆలోచనలో ఉంటారు. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మన వ్యాపారాన్ని ఎంచుకుంటే.. కచ్చితంగా మంచి లాభాలు ఆర్జించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ప్లాన్ గురించి ఈ రోజు తెలుసుకుందాం..
ప్రస్తుతం కాటన్ బడ్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో నివసించే వారే ఇలాంటి వాటిని ఉపయోగించే వారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లోనూ ప్రజలు కాటన్ బడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టే ఈ వ్యాపారంలో పెద్దగా నష్టాలు ఉండవు. అంతేకాకుండా ఔత్సాహితక యువతను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ముద్ర వంటి లోన్స్ ద్వారా కూడా ఈ కాటన్ బడ్స్ తయారీ యూనిట్‌ను మొదలు పెట్టవచ్చు. ఇంతకీ కాటన్ బడ్స్ తయారీని ఎలా ప్రారంభించాలి.? దీనికి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? ఇప్పుడు తెలుసుకుందాం..
చెవులను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే కాబటన్ బడ్స్.. చూడడానికి సింపుల్ బిజినెస్ అయినా మంచి లాభాలు ఆర్జించవచ్చు. కాటన్ బడ్స్ తయారీకి కాటన్‌తో పాటు ప్లాస్టిక్ పైప్స్ లేదా చిన్న కర్ర ముక్కలను ఉపయోగిస్తారు. వీటి ధర చాలా తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కాటన్ బడ్స్ తయారు చేసే మిషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మిషన్ ప్రారంభ ధర కూడా రూ. 20 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక పత్తి త్వరగా పాడవ్వకుండా ఉండడానికి సెల్యులోజ్ పాలిమర్ రసాయానాలను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కూడా తక్కువ ధరే ఉంటుంది. కాటన్ లో మచ్చలు, ఫంగస్ రాకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
ఇక కాటన్ బడ్స్‌ను తయారు చేసిన తర్వాత వాటిని సొంతంగా మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.మెడికల్ స్టోర్స్, హాస్పిటల్స్, టెస్టింగ్ ల్యాబ్స్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ షాపులు, బ్యూటీ పార్లర్ సెంటర్లు, ఎలక్ట్రానిక్ రిపేరింగ్ మార్కెట్లు, పెయింటింగ్ ప్రొడక్ట్ మార్కెట్లలో నేరుగా వెళ్లి విక్రయించవచ్చు. చిన్న చిన్న దుకాణాల్లో కూడా కాటన్ బడ్స్ లభిస్తున్నాయి. ఇక కాటన్ బడ్స్ తయారీ ఎలా ఉంటుందన్న వివరాలను తెలుపుతూ యూట్యూబ్‌లో ఎన్నో వీడియోలు సైతం అందుబాటులో ఉన్నాయి. లాభాల విషయానికొస్తే.. కాటన్ బడ్స్ తయారీ ద్వారా తక్కువలో తక్కువ నెలకు రూ. 30 వేలు సంపాదించవచ్చు. అయితే ఇది పూర్తిగా మీరు చేసే మార్కెటింగ్పై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




