AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Insurance: కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ రెండిటిల్లో ఏది బెటర్..?

కార్పొరేట్ హెల్త్ ఇన్యూరెన్స్ లేదా వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ రెండిటిల్లో ఏది మంచిదనే సందేహాం చాలామందికి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న కంపెనీ ఇచ్చిన హెల్త్ ఇన్యూరెన్స్ సరిపోతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. దీంతో వ్యక్తిగత బీమా తీసుకోలేరు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటంటే..

Health Insurance: కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత ఆరోగ్య బీమా.. ఈ రెండిటిల్లో ఏది బెటర్..?
Health Insurance
Venkatrao Lella
|

Updated on: Jul 08, 2026 | 7:15 PM

Share

ఏదైనా కంపెనీలో ఉద్యోగంలో చేరితే మీకు హెల్త్ ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తారు. మీతో పాటు మీ కుటుంబసభ్యులకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే కంపెనీ అందించే హెల్త్ ఇన్యూరెన్స్ సరిపోతుందని చాలామంది భావిస్తూ ఉంటారు. కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ అత్యవసర పరిస్థితుల్లో రక్షణ కవచంలా ఉపయోగడుతుంది. కానీ కంపెనీ యజమాన్యం అందించే ఆరోగ్య బీమా తగినంత లేదా దీర్ఘకాలిక కవరేజీని అందించకపోవచ్చు. ఇక మీరు ఉద్యోగాలు మారినా లేదా పదవీ విరమణ చేసినా అది పనిచేయదు. వ్యక్తిగత హెల్త్ ఇన్యూరెన్స్, కార్పొరేట్ హెల్త్ ఇన్యూరెన్స్ మధ్య అనేక తేడాలు ఉన్నాయి. ఒక్కదానిపై ఆధారపడటం అనేది మంచిది కాదు.

కార్పొరేట్ హెల్త్ ఇన్యూరెన్స్ ఏంటి..?

కార్పొరేట్ హెల్త్ ఇన్యూరెన్స్‌ను యజమాని తన ఉద్యోగుల ప్రయోజనాల ప్యాకేజీలో భాగంగా కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు సంస్థలో కొనసాగుతున్నంత కాలం మాత్రమే కవరేజ్ లభిస్తుంది. అదే వ్యక్తిగత ఆరోగ్య బీమా నేరుగా బీమా సంస్థ నుండి కొనుగోలు చేస్తాం. ప్రీమియంను సకాలంలో చెల్లించినంత కాలం అది పనిచేస్తుంది. దీంతో ఉద్యోగంతో సంబంధం లేకుండా మీకు ఎప్పుడైనా రక్షణగా ఉంటుంది. ఈ కారణంతో ఉద్యోగంతో సంబంధం లేకుండా పర్సనల్ హెల్త్ ఇన్యూరెన్స్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం.

ఏ పాలసీ మెరుగైన కవరేజీని అందిస్తుంది..?

కార్పొరేట్ పాలసీ బీమా కవరేజీని యజమాని నిర్ణయిస్తారు. వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటే అది సరిపోకపోవచ్చు. అదే వ్యక్తిగత పాలసీతో మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా బీమా మొత్తాన్ని మనమే నిర్ణయించుకోవ్చు. ఇక పాలసీ రెన్యూవల్ సమయంలో మీరు తీవ్ర అనారోగ్య కవరేజీ, పునరుద్ధరణ ప్రయోజనాలు లేదా అధిక కవరేజీ వంటి ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఒక కార్పొరేట్ పాలసీలు, గ్రూప్ పాలసీలు, పాలసీ నిబంధనలను బట్టి మొదటి రోజు నుండే ముందస్తు వ్యాధులకు కూడా కవరేజీని అందిస్తాయి. వ్యక్తిగత పాలసీలో ముందస్తు వ్యాధులకు కవరేజీ ఏడాది కాలం పీరియడ్ తర్వాత అందుతుంది. ఇక కార్పొరేట్ ఆరోగ్య బీమా అనేది అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. కానీ దానిపైనే ఆధారం కాకూడదు. వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ నిరంతర రక్షణను, అధిక కవరేజీని, ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. మీ యజమాని అందించే దానికంటే ఎక్కువ కవరేజీ అవసరమైనప్పుడు ఇది మరింత ఉపయోగపడుతుంది. ఈ రెండూ కలిగి ఉండటం వల్లన వైద్య పెరుగుతున్న వైద్య ఖర్చుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Follow Us
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
రోజూ గిన్నెడు తిన్నారంటే మీ బరువు ఇట్టే తగ్గిపోతారు.. గుగ్గిల్లు
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
వాట్సాప్‌లో కొత్త స్కామ్.. తెలుసుకోకపోతే.. నెక్ట్స్ బాధితులు మీరే
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
మళ్లీ జంటగా కనిపించిన తరుణ్ భాస్కర్-ఈషా రెబ్బా.. వీడియో ఇదిగో
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?
కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ VS వ్యక్తిగత బీమా.. ఏది బెస్ట్..?
పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం
పిల్లల చేతికి తాళాలు ఇస్తున్నారా..? అయితే, మీరు జైలుకెళ్లడం ఖాయం
వీటిల్లో నిజమైన విగ్రహం ఏదో 5 సెకన్లలో చెప్పుకోండి చూద్దాం..
వీటిల్లో నిజమైన విగ్రహం ఏదో 5 సెకన్లలో చెప్పుకోండి చూద్దాం..
Raja Yoga: గ్రహ రాజు రవి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికార యోగాలు..
Raja Yoga: గ్రహ రాజు రవి కటాక్షం.. ఆ రాశుల వారికి అధికార యోగాలు..
కారుణ్య మరణాలపై ఏపీ ప్రభుత్వం సంచలన మార్గదర్శకాలు..
కారుణ్య మరణాలపై ఏపీ ప్రభుత్వం సంచలన మార్గదర్శకాలు..
గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?
గతంలో గిల్‌కు జరిగినట్లే ఇప్పుడు తిలక్‌కూ తప్పదా ?
5వ అంతస్తు నుంచిపడిన బాలుడికి పునర్జన్మ.. హైదరాబాద్ వైద్యుల సాహసం
5వ అంతస్తు నుంచిపడిన బాలుడికి పునర్జన్మ.. హైదరాబాద్ వైద్యుల సాహసం