Corporate Bond Fund: బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం.. దేశంలోని ప్రజల్లో ఆర్థిక అంశాలపై అవగాహన(Financial Literacy) పెరగటంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. ఇందుకోసం ఎక్కువ మంది సిప్ లను వినియోగిస్తున్నారు. కార్పొరేట్ బాండ్ ఫండ్లు మదుపరులకు మంచి రిటర్నులు(Returns) అందిస్తున్నాయి. కార్పొరేట్ బాండ్స్ ఒకరకమైన ఓపెన్ ఎండెడ్ డెట్ ఫండ్స్. ఇవి మదుపరుల నుంచి కలెక్ట్ చేసిన సొమ్ములో 80 శాతాన్ని AAA, AA+ రేటింగ్ కలిగిన కంపెనీల బాండ్లలో పెట్టుబడి పెడుతుంటాయి. ఎందుకంటే వీటిలో క్రెడిట్ రిస్క్ ఉండదుకాబట్టి. చాలా వరకు కార్పొరేట్ ఫండ్లు ప్రభుత్వ సెక్కూరిటీలలో పెట్టుబడి పెడుతుంటాయి. వీటిలో దీర్ఘకాలిక, స్వల్పకాలిక బాండ్లు ఉంటాయి.
కార్పొరేట్ బాండ్ మ్యూచువల్ ఫండ్స్ లక్షణాలు..
– కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రాబడులు ఫండ్ పోర్ట్‌ఫోలియో ద్వారా నిర్ణయించబడతాయి.
– కార్పొరేట్ బాండ్ ఫండ్స్ అంటే కార్పొరేట్ డెట్ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే ఫండ్స్. అవి ఎక్కువ కాలం మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. అందువల్ల వల్ల వీటికి వడ్డీ రేటు రిస్క్ ఉంటుంది.
– కార్పొరేట్ బాండ్ ఫండ్స్ వడ్డీ రేటు మార్పుల వల్ల ఎఫెక్స్ అవుతాయి. దీర్ఘకాలిక సెక్యూరిటీల్లో పెట్టుబడుల వల్ల వడ్డీ రేట్లలో ఒలటాలిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
– కార్పొరేట్ బాండ్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోల్లో 80 శాతం పెట్టుబడులు బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, స్ట్రక్చర్డ్ లైబెలిచీస్లో పెట్టుబడులు పెడతాయి.
– వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు వీటిపై ప్రభావం చూపుతాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ రేట్లు తగ్గుతాయి. మెచూరిటీ సమయానుగుణంగా బాండ్ల రేట్లు మారతాయి.
L&T Triple Ace Bond Fund 22.54%, HDFC Corporate Bond Fund 21.18%, Aditya Birla Sun Life Corporate Bond Fund 21.00% కార్పొరేట్ బాండ్ ఫండ్స్ సిప్ లలో పెట్టుబడులు పెట్టిన వారికి రిటన్ ఇచ్చాయి. ఈ మూడు ఫండ్స్ ఇన్వెస్టర్లకు మంచి సరాసరిన 21 శాతం వార్షిక రిటర్న్ అందిచాయి.
గమనిక: పెట్టుబడులు ఇన్వెస్టర్ల సొంత నిర్ణయం. దీనిపై తమ ఆర్థిక సలహాదారును సంప్రదించి నిర్ణయం తీసుకోవటం ఉత్తమం.
ఇవీ చదవండి:
GST: జీఎస్టీ నష్టాల భర్తీ మరో 5 ఏళ్లు కావాలంటున్న రాష్ట్రాలు.. కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖలు..
Elon Musk Vs Putin: రష్యా అధ్యక్షుడికి ఎలాన్ మస్క్ ఛాలెంజ్.. ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు..