Investment Tips: బంగారం, వెండే కాదు.. ఫ్యూచర్‌లో ఈ మెటల్‌‌ ధరకు రెక్కలు రావడం పక్కా..!

ఒకప్పుడు బంగారం ధల వందల్లో ఉండేది తర్వాత వేలల్లో పెరిగింది. ఇప్పుడు ఏకంగా లక్షలు పలుకుతోంది. భూమి మీద దొరికే అరుదైన లోహాల్లో బంగారం ఒకటి. కాబట్టి దీని డిమాండ్ ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇదే తరహాలో ఫ్యూచర్ లో మరికొన్ని లోహాలకు కూడా ఫుల్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందట. అందుకో రాగి ఒకటి. దీని గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

Investment Tips: బంగారం, వెండే కాదు.. ఫ్యూచర్‌లో ఈ మెటల్‌‌ ధరకు రెక్కలు రావడం పక్కా..!
Copper Price

Updated on: Oct 24, 2025 | 5:17 PM

భూమిలో దొరికే ప్రతి లోహాన్ని విలువైనదిగానే భావించాలి. అయితే దాన్ని ఏయే అవసరాలకు వాడతారు అన్నదాన్ని బట్టి దాన్ని డిమాండ్ ఉంటుంది. ఇలా చూస్తే ఫ్యూచర్ లో రాగి.. బంగారంగా మార‌నుంద‌ని ఆర్థిక, మైనింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్, క్లీన్ ఎనర్జీ వంటివి డెవలప్ అవుతున్న నేపథ్యంలో రాగికి మంచి డిమాండ్ ఉంటుందని కొన్ని స్టడీలు కూడా చెప్తున్నాయి.

రాగిదే ఫ్యూచర్

ప్రస్తుతం బంగారం, వెండితో పోలిస్తే.. రాగికి అంత ఎక్కువగా వాల్యూ లేదు. అయితే భవిష్యత్తు అవసరాలను దృష్టిలోపెట్టుకుని చూస్తే.. రాగి అన్నింటికంటే కీలకమైన మెటల్ గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు, రెన్యువబుల్ ఎనర్జీ, ఏఐ, డిఫెన్స్ పరికరాలలో కాపర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. గతంలో కెనడాలోని బారిక్ గోల్డ్ సంస్థ తన పేరులో గోల్డ్‌ పదాన్ని తొలగించి కేవలం ‘బారిక్’ గా మార్చుకుంది. గ్లోబల్ లెవల్ లో కాపర్ గనుల ప్రాధాన్యం పెరగడమే దీనికి కారణమని నిపుణులు చెప్తున్నారు.

ఇన్వెస్ట్‌మెంట్‌గా…

బంగారం, వెండిలో పెట్టుబడులు పెట్టేవాళ్లు రాగిపై కూడా కొంత దృష్టి పెట్టొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం కాప‌ర్ వినియోగం భారీగా పెరుగుతోంది. రాగికి పెరుగుతున్న డిమాండ్‌ను కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కాపర్ మైనింగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే రాగి కూడా.. బంగారం, వెండి తరహాలో ఒక విలువైన ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మారే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..