Debit, PAN: డెబిట్‌, పాన్‌కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాల్సిందే.. లేకపోతే ఆ లావాదేవీల్లో ఆటంకాలు తప్పవు

|

Jan 23, 2021 | 9:27 PM

Debit, PAN: డెబిట్‌, పాన్‌ కార్డుల అనుసంధానం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఎస్బీఐ ఖాతా ఉంటే సంబంధిత డెబిట్‌ కార్డు ద్వారా విదేశీ లావాదేవీలను ఎలాంటి అడ్డంకులు...

Debit, PAN: డెబిట్‌, పాన్‌కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాల్సిందే.. లేకపోతే ఆ లావాదేవీల్లో ఆటంకాలు తప్పవు
Follow us on

Debit, PAN: డెబిట్‌, పాన్‌ కార్డుల అనుసంధానం ఇప్పుడు తప్పనిసరిగా మారింది. ఎస్బీఐ ఖాతా ఉంటే సంబంధిత డెబిట్‌ కార్డు ద్వారా విదేశీ లావాదేవీలను ఎలాంటి అడ్డంకులు లేకుండా పొందాలనుకుంటే తప్పకుండా పాన్‌తో అనుసంధానం చేయాల్సిందే. దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ రంగమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారులు తమ పాన్‌ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని ఎస్‌బీఐ తెలిపింది. పాన్‌ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకుంటే డెబిట్‌ కార్డు ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా అంతర్జాతీయ లావాదేవీలను చేసుకోవచ్చని తెలిపింది. ఒక వేళ అప్‌డేట్‌ చేసుకోకపోతే అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి ఆటంకాలు తప్పవని తెలిపింది.

కాగా, బ్యాంకు ఖాతాలకు తప్పనిసరిగా పాన్‌కార్డు అనుసంధానం ఉండాలని ఎన్నో రోజులుగా బ్యాంకు అధికారులు సూచిస్తూ వస్తున్నారు. అనుసంధానం చేసుకునేందుకు అందుకు గడువు కూడా విధిస్తున్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా పాన్‌ కార్డును అనుసంధానం చేసుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Jio recharge: మరో కొత్త ప్లాన్‌తో యూజర్లను ఆక్టుకుంటోన్న రియలన్స్‌ జియో.. ఎంత రీఛార్జ్‌ చేయాలి.. బెన్‌ఫిట్స్‌ ఏంటి..