Fixed Deposit: మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా..? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..!

| Edited By: Narender Vaitla

Mar 21, 2022 | 7:42 AM

Fixed Deposit: వివిధ కాల వ్యవధిలో రూ.1 కోట్ల వరకు డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై..

Fixed Deposit: మీరు బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా..? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ..!
Follow us on

Fixed Deposit: వివిధ కాల వ్యవధిలో రూ.1 కోట్ల వరకు డిపాజిట్లకు అత్యధిక వడ్డీ రేట్లను అందించే బ్యాంకులు ఉన్నాయి. ప్రస్తుతం ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై మంచి బెనిఫిట్స్‌ (Benefits) కల్పిస్తున్నాయి. డబ్బులు ఇన్వెస్ట్‌ చేసేవారికి ఇది మంచి అవకాశం. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (Bank FD) జనాదరణ పొందిన పెట్టుబడులు కొనసాగుతున్నాయి. కేవలం సీనియర్‌ సిటిజన్స్‌ (Senior Citizens)లలో మాత్రమే కాకుండా హామీనిచ్చే ఆదాయం కోసం వెతుకుతున్న పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల ద్వారా 15 సంవత్సరాలలో ఉన్న మీ పిల్లల ఉన్నత విద్య కోసం పొదుపు చేయడం ప్రభావవంతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎఫ్‌డీ పన్ను అనంతరం వడ్డీ రేటు నిజమైన రాబడి రాకపోవచ్చు. వివిధ కాల వ్యవధిలో కోటి రూపాయల వరకు డిపాజిట్‌లకు అత్యధిక ఫిక్స్‌డ్‌ రేట్లను అందించే బ్యాంకులు ఈ విధంగా ఉన్నాయి.

  1.  డీసీబీ బ్యాంకు:  6 నెలల నుంచి సంవత్సరం ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ. ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5.30 నుంచి 6శాతం , 2 నుంచి 3 ఏళ్ల వరకు 6.25 శాతం, 3 నుంచి 5 ఏళ్ల వరకు ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ అందిస్తోంది.
  2.  యస్‌ బ్యాంక్‌: 6 నెలల నుంచి సంవత్సరం ఎఫ్‌డీలపై 4.75 నుంచి 5 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండేళ్ల వరకు 5.75 నుంచి 6 శాతం, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6.25 శాతం, 5 ఏళ్లకుపైగా ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ అందిస్తోంది.
  3. ఇండస్‌ఇండ్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.50 శాతం నుంచి 5.50 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 6 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 6.50 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6.50 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 6- 6.5 శాతం వరకు.
  4. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకు:– 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 3.50 శాతం నుంచి 4.75 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.75 శాతం నుంచి వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.75 శాతం నుంచి 6 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6 నుంచి 6.50 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 6 శాతం వరకు వడ్డీ ఉంది.
  5. కరూర్‌ వైశ్యా బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.00 శాతం నుంచి 4.50 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.40 శాతం వడ్డీ, 2 నుంచి 3ఏళ్ల వరకు 5.50 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.65 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.80- 5.90 శాతం వరకు వడ్డీ.
  6. యాక్సిస్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.40 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.10 శాతం నుంచి 5.25 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.40 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.40 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.75 శాతం వరకు వడ్డీ అందుబాటులో ఉంది.
  7. ఆర్‌బీఎల్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.50 శాతం నుంచి 5.25 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 6.25 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 6.50 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6.30 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.75- 6.30 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  8. బంధన్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.50 శాతం, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.25 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 6.25 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 6.25 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.50 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  9. సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 3.80 నుంచి 4.50 శాత వరకు, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 4.90 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 4.90 శాతం నుంచి 5.25 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.50 శాతం వడ్డీ వరకు, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.50 శాతం నుంచి 5.65 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  10. కెనరా బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.40 శాతం, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.15 నుంచి 5.15 శాతం వరకు వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.20 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.45 శాతం నుంచి 5.55 శాతం వరకు వడ్డీ, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.50 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  11. ఎస్‌బీఐ: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.40 శాతం, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.10 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.20 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.45 శాతం వరకు వడ్డీ, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.50 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  12. కోటాక్‌ మహేంద్రా బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.40-4.50 శాతం, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.00 -5.10 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.20 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.45 శాతం వరకు వడ్డీ, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.50 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.
  13. ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంకు: 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు 4.90 శాతం, ఏడాది నుంచి రెండు సంవత్సరాల వరకు 5.15 -5.20 శాతం వడ్డీ, 2 నుంచి 3 ఏళ్ల వరకు 5.20 శాతం వడ్డీ, 3 నుంచి 5 ఏళ్ల వరకు 5.45 శాతం వరకు వడ్డీ, ఇక ఐదేళ్లకు పైగా కాలపరిమితికి 5.45 శాతం వరకు వడ్డీ రేటు ఉంది.

ఇవి కూడా చదవండి:

Online Shopping: ఆన్‌లైన్‌ షాపింగ్‌లో డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

Tax Saving: ట్యాక్స్ సేవింగ్స్ కోసమని ఇన్వెస్ట్ చేయడానికి తొందరపడకండి.. ఇలా చేయండి..