Auto Expo 2023: కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేశాయ్! అన్నీ దిగ్గజ కంపెనీల క్యూ.. వాటిలో బెస్ట్ ఇవే!

| Edited By: Anil kumar poka

Dec 24, 2022 | 6:05 PM

కొత్త సంవత్సరంలో పదుల సంఖ్యలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. అందుకు వేదికగా జనవరిలో జరిగే ఆటో ఎక్స్ పోను చేసుకుంటున్నాయి.

Auto Expo 2023: కొత్త ఎలక్ట్రిక్ కార్లు వచ్చేశాయ్! అన్నీ దిగ్గజ కంపెనీల క్యూ.. వాటిలో బెస్ట్ ఇవే!
Hyundai Ioniq 5
Follow us on

భవిష్యత్తులో అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా. ఎందుకంటే క్రమంగా పెరిగిపోతున్న ఇంధన ధరలు.. సామాన్యుడికి అందనంత స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో దొరకుతున్న అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనం. అందుకే ఈ తరహా వాహనాలకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. అందుబాటులో ఉన్న మోడళ్లపై ప్రీ బుకింగ్స్ కూడా చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా వచ్చిన ఈ డిమాండ్ ను గుర్తించిన పలు దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ముమ్మరం చేశాయి. కొత్త సంవత్సరంలో పదుల సంఖ్యలో కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సమాయత్తం అవుతున్నాయి. అందుకు వేదికగా జనవరిలో ఢిల్లీలో జరిగే ఆటో ఎక్స్ పోను చేసుకుంటున్నాయి. ఆ ఎక్స్ పో లో తమ ఎలక్ట్రిక్ వేరియంట్ మేడళ్లను ప్రదర్శించి వినియోగదారులకు ఆకర్షించాలని ప్రణాళిక చేసుకుంటున్నాయి. అలా ప్రదర్శనకు సిద్ధమైన పలు కంపెనీలకు చెందిన కార్లు, వాటి ప్రత్యేకతలను గురించి తెలుసుకుందాం..

మారుతీ ఎస్ యూ వీ ఈవీ..

మారుతీ సుజుకీ ఎస్ యూవీ మోడల్లో ఎలక్ట్రిక్ వేరియంట్ కారును లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిని వచ్చే 16వ ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 2025 నాటికి దీనిని వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనుంది. 48kWh సామర్థ్యం కలిగిన రెండు బ్యాటరీ సెట్లతో పాటు ఒక్కసారి చార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు మైలేజీ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంజీ ఈవీఎస్..

ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ కూడా తన ఈవీ మోడల్ కార్లను ఆటో ఎక్స్ పో లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సేఫ్టీ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ వచ్చిన ఇండియా స్పెసిఫిక్ ఎయిర్ 2 డోర్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అలాగే ఎంజీ 4 ఈవీ పేరిట మరో కారును కూడా తీసుకురానుంది. ఈ రెండు కూడా 51 kWh, 64kWh సామర్థ్యంతో కూడిన బ్యాటరీలు కలిగి ఉన్నాయి.  51 kWh మోడల్ 350 కిలోమీటర్లు, 64kWh కారు 452 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. అలాగే మరో మోడల్ ఎయిర్ 2 డోర్ నుకూడా ఆటో ఈవెంట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది 20 kWh నుంచి 25kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీలతో వస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే 150కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

హ్యూందాయ్ ఈవీఎస్..

హ్యూందాయ్ కంపెనీ వచ్చే ఎక్స్ పో లోనే తన ఎలక్ట్రిక్ వేరియంట్ ఐనిక్ 5 ధర ప్రకటించే అవకాశం ఉంది. ఆసక్తి కలిగిన వినియోగదారులు రూ. లక్ష టోకెన్ అమౌంట్ గా కట్టి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ఇది కియా ఈవీ6 మోడల్ ను పోలి ఉంటుంది. దీనిలో రెండు బ్యాటరీ సామర్థ్యాలు ఆప్షన్స్ ఉన్నాయి. 72.6 kWh, 384 కిలమీటర్ల రేంజ్, 58 kWh, 481 కిలోమీటర్ల రేంజ్ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు ఐనిక్ 6 ని కూడా ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించే అవకాశం ఉంది. దీనిలో రెండు బ్యాటరీ సామర్థ్యాలు ఉంటాయి. 53 kWh తో 429 కిలోమీటర్ల రేంజ్, 77.4 kWhతో 614 కిలోమీటర్ల రేంజ్ అందుబాటులో ఉంటుంది.

టాటా ఈవీఎస్..

ప్రస్తుత ఎలక్ట్రిక్ కార్ల రంగంలో లీడర్ గా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకునేందుకు ఆటో ఎక్స్ పోను వేదికగా చేసుకుంటోంది. అల్ట్రోజ్ ఈవీ ని ప్రదర్శించే అవకాశం ఉంది.

బీవైడీ..

చైనాకు చెందిన బిల్డ్ యువర్ డ్రీమ్స్(బీవైడీ) తన ఎలక్ట్రిక్ వేరియంట్  అట్టో 3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ ని ఎక్స్ పో ప్రదర్శించనుంది. దీనిలో 60 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 521 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. దీని ధరను రూ. 33.9 లక్షలుగా నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..