
ప్రతీ నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకుంటాయనే విషయం తెలిసిందే. ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ కంపెనీలు కొత్త గ్యాస్ ధరలను ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఫిబ్రవరి 1 రావడంతో ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరల్లో సవరణలు చేశాయి. ఈ సారి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచగా.. గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. కమర్షియల్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు వంటి ఇతర వాణిజ్య పనుల కోసం ఉపయోగిస్తారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ వేళ వీటి ధరలు పెరగడంతో వ్యాపారులకు షాక్ తగిలినట్లయింది.
ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఫిబ్రవరి 1న వాణిజ్య సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు జరగలేదు. 2025 ఏప్రిల్ 8వ తేదీన డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత ఇప్పటివరకు ఇక వాటి ధరల్లో ఎలాంటి సవరణలు జరగలేదు. వాణిజ్య సిలిండర్ ధరల్లో మాత్రం ప్రతీ నెలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. గత నెలలో రూ.111 పెరగ్గా.. ఈ నెల మరింత పెరిగింది. దీంతో వ్యాపారులకు సిలిండర్ షాక్ తప్పడం లేదు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరిగిన తర్వాత వివిధ సిటీల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
-ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు తర్వాత ఆదివారం రూ.1740గా ఉంది. జనవరి 1న ఈ ధర రూ.1691.50 వద్ద ఉంది.
-ఇక చెన్నైలో ప్రస్తుతం రూ.1844.50 వద్ద కొనసాగుతోంది. గత నెలలో రూ.1795.00గా ఉంది. గత నెలలో పోలిస్తే రూ.49.50 పెరిగింది.
-ముంబైలో ప్రస్తుతం రూ.1692గా ఉంది. గత నెలలో రూ.1642.50 వద్ద ఉంది.
-చెన్నైలో ఫిబ్రవరి 1న రూ.1899.50 పలుకుతోంది. జనవరి 1వ తేదీన రూ.1849.50గా ఉంది. గత నెలతో పోలిస్తే రూ.50 పెరిగింది
– నవంబర్‌లో వీటి ధరలు రూ.5 తగ్గించగా.. డిసెంబర్‌లో రూ.10 తగ్గించారు.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు స్ధిరంగా ఉన్నాయి. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర రూ.887.50 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో రూ.905గా ఉండగా.. విజయవాడలో రూ.875గా ఉంది. ఇక విశాఖపట్నంలో రూ.861 వద్ద కొనసాగుతుండగా.. గుంటూరులో రూ.877గా ఉంది. అటు వరంగల్‌లో రూ.924గా ఉంది. అటు విమానం ఇంధనం(ఏటీఎఫ్) ధరలు తగ్గించారు.