వరుసగా మూడో సెషన్‌లో స్టాక్ మార్కెట్లు(Stock Market) పతనమయ్యాయి. దేశీయ సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుదల, ఆర్థిక మందగమనం ఆందోళనల మధ్య పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో బీఎస్‌ఈ (BSE) సెన్సెక్స్ 106 పాయింట్లు తగ్గి 54,365 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ (NSE) నిఫ్టీ 62 పాయింట్లు క్షీణించి 16,240 వద్ద స్థిరపడుతుంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 1.87 శాతం, స్మాల్ క్యాప్ 2.24 శాతం క్షీణించాయి. సెక్టోరల్‌గా చూస్తే మెటల్, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్, ఐటీ, రియల్టీ సూచీలు 1-5 శాతం క్షీణించాయి. మరోవైపు బ్యాంక్ ఇండెక్స్ 0.5 శాతం పెరిగింది.
బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున పతనమయ్యాయి. నిఫ్టీ మెటల్ 5.20, నిఫ్టీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.24, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ 2.29 శాతం పడిపోయాయి. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, సన్‌ఫార్మా, ఎన్‌టీపీసీ, టైటన్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, విప్రో, ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
Read Also.. Adani Green: అద్బుతాలు సృష్టిస్తున్న అదానీ గ్రీన్ స్టాక్.. మార్కెట్ క్యాప్ లో SBIని వెనక్కి నెట్టిన సంస్థ..