India Business: కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో చోటు చేసుకుంటున్న మార్పులు భారతదేశానికి అనుకూలంగా మారినట్టు కనిపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత ఎగుమతులు కోవిడ్ పూర్వ స్థాయిని దాటాయి. గత త్రైమాసికంలో దేశం 7,03,545 కోట్ల రూపాయల ఎగుమతులను నిర్వహించింది. కరోనాకు పూర్వం అంటే 2019 ఇదే కాలంలో రూ .5,62,813 కోట్లతో పోలిస్తే ఈ ఎగుమతులు 25% ఎక్కువ. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 81% ఎక్కువ. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. ఈ కాలంలో ప్రీ-కోవిడ్ స్థాయి నుండి 2.88% మాత్రమే పెరిగింది.పెరిగాయి.
యూరప్.. అమెరికా దేశాలకు..
యూరప్, అమెరికాలు ఇటీవల కాలంలో చైనా నుండి దిగుమతులను తగ్గించాయి. చైనా పై ఆగ్రహం కారణంగా, యూరప్, అమెరికా చైనా +1 విధానం ప్రకారం అక్కడి నుండి దిగుమతులను తగ్గించాయి. ఇదే సమయంలో ఆయాదేశాలు భారతదేశం నుండి దిగుమతులను పెంచుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు, మొత్తం యూఎస్ దిగుమతుల్లో చైనా వాటా 28% కి పడిపోయింది. 2020 లో ఇదే కాలంలో 35% దిగుమతులు చైనా నుంచి అమెరికా చేసుకునేది. మరోవైపు, యుఎస్ దిగుమతి మార్కెట్లో భారతదేశం వాటా 7% నుండి 9.1% కి పెరిగింది.
అమెరికాకు భారతదేశం నుండి వస్త్ర ఎగుమతులు..
భారతదేశం నుండి వస్త్ర ఎగుమతులు 2021 మొదటి ఐదు నెలల ఏటా 66,69% పెరిగాయి. అయితే, చైనా విషయంలో, ఈ పెరుగుదల కేవలం 0.62% మాత్రమే. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్స్ మాజీ అధ్యక్షుడు శరద్ కుమార్ సరాఫ్ చైనాకు చెందాల్సిన ఎగుమతి ఆర్డర్లు కొన్నినెలలుగా పెద్ద సంఖ్యలో భారతదేశానికి మారుతున్నాయని చెప్పారు.
పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా యూరప్, చైనా నుండి దిగుమతులు చేసుకోవటానికి ఇష్టపడడంలేదు. భారతదేశం వంటి దేశాలలో లభ్యం కానీ వస్తువులను మాత్రమే చైనా నుంచి వారు దిగుమతి చేసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల చైనా +1 విధానం వల్ల భారతీయ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయని ఎల్కెపి సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ ఎస్.రంగనాథన్ చెప్పారు. మొత్తమ్మీద ఇటు కరోనా ఎఫెక్ట్.. అటు చైనా తో వివిధ దేశాల విరోధం భారత్ కు లాభిస్తున్నట్టే ఉంది.
JioFiber: రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!