కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా నడిపించడంలో ఉద్యోగులు చేస్తున్న కృషికి గుర్తింపుగా చెన్నైకి చెందిన కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఆశ్చర్యపోయే శుభవార్త చెప్పింది. ఆ కంపెనీ తమ ఉద్యోగులకు కార్లు, బైక్‌లను బహుమతిగా అందించింది. కంపెనీని మరింత విజయపథంలోకి నడిపించేలా ప్రోత్సహించేందుకు వారికి ఈ గిఫ్ట్‌లను అందించినట్లు అందించినట్లు టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్స్ సంస్థ తెలిపింది. 28 మందికి కార్లు, 29 మంది ఉద్యోగులకు మోటార్ సైకిళ్లు అందించింది. కార్లలో హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్స్‌డెస్ బెంజ్ కంపెనీలకు చెందినవి ఉన్నాయి.
కంపెనీని అభివృద్ధిలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ గిఫ్ట్‌లను అందించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ తెలిపారు. ఉద్యోగులే తమకు విలువైన ఆస్తి అని చెప్పిన ఆయన.. కంపెనీలో మొత్తం 180 మంది పనిచేస్తున్నారని వెల్లడించారు.
చెప్పారు. వారిలో చాలా మందికి కారు, బైక్ కొనుగోలు చేయాలన్న ఆశ ఉంటుందని, ఆ కల నెరవేర్చేందుకు వీటిని బహుమానంగా అందించినట్లు చెప్పారు.
అంతే కాదు.. కంపెనీ నిర్ణయించినది కాకుండా.. ఇంకా మంచి వాహనం కొనుగోలు చేయాలని ఉద్యోగికి అనిపిస్తే మిగిలిన మొత్తం చెల్లించి కొనుగోలు చేసుకునే అవకాశాన్ని కూడా ఉద్యోగులకు కల్పించినట్లు తెలిపారు. వివాహ వేడుకకు సాయం కింద రూ.50వేలు చెల్లించేవాళ్లమని, ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని రూ.1లక్షకు పెంచుతున్నట్లు కూడా పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి