EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా కూడా చెక్ చేయొచ్చని మీకు తెలుసా? వివరాలివే..

|

Jan 27, 2023 | 8:24 AM

Provident Fund Account Checking: ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు/ఈపీఎఫ్ చందాదారులు తమ తమ ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు.

EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను ఇలా కూడా చెక్ చేయొచ్చని మీకు తెలుసా? వివరాలివే..
Epfo
Follow us on

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు/ఈపీఎఫ్ చందాదారులు తమ తమ ఖాతాల్లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. చాలా మందికి ఈ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి వాళ్లను వీళ్లను అడుగుతుంటారు. కొన్ని సందర్భాల్లో అయితే, ముక్కు మొహం తెలియని వారికి తమ ఖాతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయడం ద్వారా మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలా అక్కడికీ ఇక్కడీ వెళ్లడం, తెలియని వారిని ఆశ్రయించాల్సిన పని లేదు. ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్ సర్వీస్‌ల ద్వారా ఇంట్లోనే తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ని ఈజీగా చెక్ చేయొచ్చు.

యాప్ ద్వారా, ఆన్‌లైన్‌లోనై ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ముందు.. వినియోగదారులు తమ UAN ని యాక్టీవేట్ చేసి, తమ మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. తాము పని చేసే సంస్థ ఇచ్చే సమాచారం ఆధారంగా యూఏఎన్‌ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉద్యోగులు తమ ఖాతాలో అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఫోన్ నెంబర్ ద్వారా..

EPF ఖాతాదారులు తమ ఖాతాలో డబ్బు జమ చేశారో లేదో చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425కి మిస్ కాల్ ఇవ్వాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా కట్ చేయబడుతుంది.

ఇవి కూడా చదవండి

SMS ద్వారా PF బ్యాలెన్స్‌ని ఎలా తనిఖీ చేయాలి..

మీ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN ENG అని టైప్ చేసి ద్వారా 7738299899కి SMS పంపాలి. మెసేజ్ లోని చివరి 3 అక్షరాలు మీకు నచ్చిన భాషను సూచిస్తాయి. ఇందులో ENG అంటే ఆంగ్లం. మీరు ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ, పంజాబీ, తెలుగు, మలయాళం మరియు గుజరాతీ వంటి మొత్తం 10 భాషల నుండి ఎంచుకోవచ్చు. ఉదాహరణకు హిందీ కోసం HIN, పంజాబీ కోసం PUN, గుజరాతీకి GUJ, మరాఠీకి MAR, కన్నడ కోసం KAN, తెలుగు కోసం TEL, తమిళం కోసం TAM, మలయాళం కోసం MAL, బెంగాలీకి BEN పంపాలి. ఇకపోతే మొబైల్ నంబర్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)తో రిజిస్టర్ చేయబడిన అదే మొబైల్ నంబర్ నుండి SMS పంపబడుతుంది. ఒకసారి మీరు మెసేజ్ పంపిన తరువాత.. కాసేపటికే ఈపీఎఫ్‌వో మీ పీఎఫ్ చివరి ట్రాన్సా్క్షన్స్ వివరాలు, బ్యాలెన్స్ వివరాలు, అందుబాటులో ఉన్న కేవైసీ సమాచారాన్ని మీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా పంపుతుంది.

UMANG యాప్‌ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి..

ముందుగా ప్లే స్టోర్/యాప్ స్టోర్ నుండి ఉమాంగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉమాంగ్ యాప్‌ని తెరిచి, మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. దిగువన ఉన్న ‘ఆల్ సర్వీసెస్’ ఆప్షన్స్‌పై క్లిక్ చేయాలి. సెలక్షన్స్ లిస్ట్ నుంచి ‘EPFO’ని సెర్చ్ చేసి, దానిని సెలక్ట్ చేయాలి. ఆ తరువాత ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి ‘View Passbook’పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ UANని నమోదు చేసి, గెట్ OTPపై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, లాగిన్‌పై క్లిక్ చేయాలి. మీ పాస్‌బుక్ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌తో పాటు అన్ని వివరాలు అందులో కనిపిస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..