ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాంకు ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి మోసగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు లేదా దొంగిలించిన ఆధార్ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు ఓటీపీ ప్రమాణీకరణ లేకుండానే డబ్బును కూడా విత్‌డ్రా చేయగలుగుతున్నారు. అయితే ఈ మోసం అనేది కచ్చితంగా మన వేలిముద్రలను మనకు తెలియకుండా తస్కరించడంతో పాటు వివిధ రకాల ద్వారా జరుగుతూ ఉంది. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు, ముఖ్యంగా మన అనుమతి లేకుండా మన బయోమెట్రిక్స్ వాడడానికి వీలు లేకుండా యూఐడీఏఐ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా ఆధార్ హోల్డర్‌లు తమ బయోమెట్రిక్‌లను ప్రామాణీకరణ కోసం ఉపయోగించకుండా తాత్కాలికంగా లాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బయోమెట్రిక్ లాక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
బయోమెట్రిక్ లాకింగ్/అన్‌లాకింగ్ అనేది ఆధార్ హోల్డర్ వారి బయోమెట్రిక్‌లను లాక్ చేయడానికి, తాత్కాలికంగా అన్‌లాక్ చేయడానికి అనుమతించే ఫీచర్ ఈ సదుపాయం బయోమెట్రిక్స్ డేటాకు సంబంధించిన గోప్యతను బలోపేతం చేయడానికి ఉద్దేశించి యూఐడీఏఐ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బయోమెట్రిక్ లాక్ విధానంలో వేలిముద్ర, కనుపాప, ముఖం లాక్ అవుతాయి. బయోమెట్రిక్ లాకింగ్ తర్వాత ఆధార్ హోల్డర్ సమ్మతి లేకుండా బయోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణను నిర్వహించలేరు. అయితే మొబైల్ నంబర్‌లను నమోదు చేసుకున్న ఆధార్ నంబర్ హోల్డర్‌లు మాత్రమే తమ బయోమెట్రిక్‌లను లాక్ చేయవచ్చు. బయోమెట్రిక్‌లను లాక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ విధానం (ఫింగర్‌ప్రింట్/ఐరిస్/ఫేస్)ని ఉపయోగించి ఏదైనా ప్రామాణీకరణ సేవలను అమలు చేయడానికి యూఐడీను ఉపయోగిస్తే బయోమెట్రిక్‌లు లాక్ చేశారని సూచించే నిర్దిష్ట ఎర్రర్ కోడ్ ‘330’ ప్రదర్శితమవుతుంది.
మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడానికి మీరు ఎం ఆధార్ యాప్ లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని ఉపయోగించవచ్చు. మీ బయోమెట్రిక్‌లు లాక్ చేసిన తర్వాత మీరు వాటిని అన్‌లాక్ చేసే వరకు మీరు వాటిని ఆధార్ ప్రామాణీకరణ కోసం ఉపయోగించలేరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..