AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aadhaar Biometric Lock: ఆధార్ బయోమెట్రిక్ లాక్‌తో ఆ భయాలకు చెక్.. ఆ ఫీచర్‌తో ఆధార్‌కు మరింత భద్రత

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాంకు ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి మోసగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు లేదా దొంగిలించిన ఆధార్ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు ఓటీపీ ప్రమాణీకరణ లేకుండానే డబ్బును కూడా విత్‌డ్రా చేయగలుగుతున్నారు. అయితే ఈ మోసం అనేది కచ్చితంగా మన వేలిముద్రలను మనకు తెలియకుండా తస్కరించడంతో పాటు వివిధ రకాల ద్వారా జరుగుతూ ఉంది.

Aadhaar Biometric Lock: ఆధార్ బయోమెట్రిక్ లాక్‌తో ఆ భయాలకు చెక్.. ఆ ఫీచర్‌తో ఆధార్‌కు మరింత భద్రత
Aadhaar Card
Nikhil
|

Updated on: Jun 23, 2024 | 6:43 PM

Share

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా బ్యాంకు ఖాతాల నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి మోసగాళ్లు నకిలీ ఆధార్ కార్డులు లేదా దొంగిలించిన ఆధార్ నంబర్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వారు ఓటీపీ ప్రమాణీకరణ లేకుండానే డబ్బును కూడా విత్‌డ్రా చేయగలుగుతున్నారు. అయితే ఈ మోసం అనేది కచ్చితంగా మన వేలిముద్రలను మనకు తెలియకుండా తస్కరించడంతో పాటు వివిధ రకాల ద్వారా జరుగుతూ ఉంది. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు, ముఖ్యంగా మన అనుమతి లేకుండా మన బయోమెట్రిక్స్ వాడడానికి వీలు లేకుండా యూఐడీఏఐ ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆప్షన్. ఈ ఆప్షన్ ద్వారా ఆధార్ హోల్డర్‌లు తమ బయోమెట్రిక్‌లను ప్రామాణీకరణ కోసం ఉపయోగించకుండా తాత్కాలికంగా లాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ బయోమెట్రిక్ లాక్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బయోమెట్రిక్ లాకింగ్/అన్‌లాకింగ్ అనేది ఆధార్ హోల్డర్ వారి బయోమెట్రిక్‌లను లాక్ చేయడానికి, తాత్కాలికంగా అన్‌లాక్ చేయడానికి అనుమతించే ఫీచర్ ఈ సదుపాయం బయోమెట్రిక్స్ డేటాకు సంబంధించిన గోప్యతను బలోపేతం చేయడానికి ఉద్దేశించి యూఐడీఏఐ ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. బయోమెట్రిక్ లాక్ విధానంలో వేలిముద్ర, కనుపాప, ముఖం లాక్ అవుతాయి. బయోమెట్రిక్ లాకింగ్ తర్వాత ఆధార్ హోల్డర్ సమ్మతి లేకుండా బయోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించి ఆధార్ ప్రామాణీకరణను నిర్వహించలేరు. అయితే మొబైల్ నంబర్‌లను నమోదు చేసుకున్న ఆధార్ నంబర్ హోల్డర్‌లు మాత్రమే తమ బయోమెట్రిక్‌లను లాక్ చేయవచ్చు. బయోమెట్రిక్‌లను లాక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ విధానం (ఫింగర్‌ప్రింట్/ఐరిస్/ఫేస్)ని ఉపయోగించి ఏదైనా ప్రామాణీకరణ సేవలను అమలు చేయడానికి యూఐడీను ఉపయోగిస్తే బయోమెట్రిక్‌లు లాక్ చేశారని సూచించే నిర్దిష్ట ఎర్రర్ కోడ్ ‘330’ ప్రదర్శితమవుతుంది. 

ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడం ఎలా?

మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేయడానికి మీరు ఎం ఆధార్ యాప్ లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్‌ని ఉపయోగించవచ్చు. మీ బయోమెట్రిక్‌లు లాక్ చేసిన తర్వాత మీరు వాటిని అన్‌లాక్ చేసే వరకు మీరు వాటిని ఆధార్ ప్రామాణీకరణ కోసం ఉపయోగించలేరు.

ఇవి కూడా చదవండి

ఆన్‌లైన్‌లో బయోమెట్రిక్‌ల లాక్ ఇలా

  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 
  • ‘మై ఆధార్’ ట్యాబ్‌పై క్లిక్ చేసి, ‘ఆధార్ సేవలు’ కింద, ‘ఆధార్ లాక్/అన్‌లాక్’పై క్లిక్ చేయాలి. 
  • ఆధార్ నంబర్ లేదా వీఐడీను నమోదు చేయాలి.
  • అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. 
  • అనంతరం ఓటీపీను నమోదు చేయాలి.
  • స్క్రీన్‌పై ప్రదర్శించే నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేసిన తర్వాత ‘ఎనేబుల్’ బటన్‌ను క్లిక్ చేయాలి.

ఎం ఆధార్ యాప్ ద్వారా లాక్ చేయడం ఇలా

  • మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.
  • ఓటీపీను నమోదు చేయాలి. 
  • 4 అంకెల పిన్‌ని సెట్ చేయాలి. 
  • లాక్ బయోమెట్రిక్స్ పై క్లిక్ చేయాలి. 4 అంకెల పిన్‌ని నమోదు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
‘ఉపాధి హామీ’ రద్దు.. నేటి నుంచి కొత్త చట్టం!
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
ఇకపై ప్రతీ నెల సన్న బియ్యం పంపిణీ.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు..
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి