India's Top 5 Cng Cars
పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యుల వెన్ను విరుస్తున్నాయి. కానీ, సీఎన్‌జీ ధరలు స్వల్పంగా పెరిగినా సామాన్యులకు అందుబాటు ధరల్లోనే ఉన్నాయి. ఇంధన బడ్జెట్‌ను తగ్గించగల భారతదేశపు టాప్-5 CNG కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటిలో కొన్ని కేవలం రూ.75లో 35 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయి.
- మారుతి సెలెరియో సీఎన్‌జీ(Maruti Celerio CNG): CNG కార్లలో మారుతీ సుజుకి ఇండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇందులో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్ మారుతి సెలెరియో. సెలెరియో దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం గల పెట్రోల్ కారు. అలాగే సీఎన్‌జీలోనూ ఇది టాప్ ప్లేస్‌లోనే ఉంది. ఇది 1 కిలో సీఎన్‌జీలో 35.60 కిమీ మైలేజీని ఇస్తుంది. ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.75.61గా ఉంది. ఈ విధంగా, ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో మారుతి సెలెరియో 75 రూపాయలతో 35 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
- మారుతి వ్యాగనార్ సీఎన్‌జీ (WagonR CNG): మారుతి కంపెనీకి చెందిన మరో హ్యాచ్‌బ్యాక్ మారుతి వ్యాగనార్ సీఎన్‌జీ మైలేజీలోనూ తగ్గేదేలే అంటోంది. ఇది 1 కిలో సీఎన్‌జీతో 34.05 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.42 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
- మారుతి ఆల్టో సీఎన్‌జీ (Maruti Alto CNG): దేశంలోనే అత్యంత చవకైన కారుగా మారుతి ఆల్టో CNG నిలిచింది. ఈ వేరియంట్ ప్రారంభ ధర రూ.5.03 లక్షలు. అదే సమయంలో, ఇది ఒక కిలో సీఎన్‌జీలో 31.59 కిమీల మైలేజీని అందిస్తుంది. ఇది 800సీసీ ఇంజన్‌తో వస్తుంది.
- మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ (Maruti S-Presso CNG): మారుతి నుంచి వచ్చిన మరో కారు, మారుతి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ. మైలేజీలోనూ ఇది ఎంతో గొప్పగా ఆకట్టుకుంటోంది. ఇది కిలోగ్రాము గ్యాస్‌తో 31.2 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.5.38 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
- టాటా టియాగో సీఎన్‌జీ (Tata Tiago CNG): టాటా మోటార్స్ తన CNG కార్లను ఈ సంవత్సరం నుంచే భారత మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ క్రమంలో వీటిలో కంపెనీకి చెందిన టాటా టియాగో సీఎన్‌జీ కారు మైలేజీతో వాహనదారులను ఆకట్టుకుంటుంది. ఇది ఒక కిలో గ్యాస్‌లో 26 కి.మీ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.6.10 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.