Paytm feature: స్టాక్ ట్రేడింగ్‌లో నష్టాలకు చెక్..పేటీఎంలో కొత్త ఫీచర్..!

ఆధునిక కాలంలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్లలోని వివిధ రకాల యాప్ ల ద్వారా యూపీఐ విధానంలో సులభంగా నిర్వహించుకునే వీలు కలిగింది. రోడ్డు పక్కనే ఉండే చిన్న కిరాణా షాపు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకూ బిల్లులను వీటి ద్వారా చెల్లించవచ్చు. ఇలాంటి యాప్ లలో పేటీఎం ఒకటి. దీనికి అనేక మంది యూజర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేటీఎం తన కస్టమర్లకు కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. యూపీఐ ట్రేడింగ్ బ్లాక్ లకు వీలుండేలా అవకాశం కల్పించింది.

Paytm feature: స్టాక్ ట్రేడింగ్‌లో నష్టాలకు చెక్..పేటీఎంలో కొత్త ఫీచర్..!
Stock Market

Updated on: Mar 05, 2025 | 7:30 PM

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ విపరీతంగా విస్తరించింది. ప్రతి ఒక్కరూ దానిలో పెట్టుబడులు పెడుతున్నారు. పేటీఎం కొత్త ఫీచర్ తో బ్రోకరేజ్ యాప్ లలో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్టాక్ ట్రేడర్లు తమ బ్యాంక్ ఖాతాలో నిధులను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. దీనివల్ల ట్రేడింగ్ ఖాతాలకు పెద్ద మొత్తాలను బదిలీ చేయనవసరం ఉండదు. బ్రోకర్లు డబ్బులను బదిలీ చేయడానికి బదులుగా వ్యాపారులు తమ ఖాతాలో నిధులను బ్లాక్ చేస్తారు.

పేటీఎంగా పిలిచే వన్ 97 కమ్యూనికేషన్ లిమిటెడ్ తీసుకువచ్చిన యూటీఐ ట్రేడింగ్ బ్లాక్ ఫీచర్ ను సింగిల్ బ్లాక్ మల్టిఫుల్ డెబిట్స్ అని కూాడా పిలుస్తారు. దీని వల్ల స్టాక్ ట్రేడర్లకు బ్రోకింగ్ అనుభవం సులభతరం అవుతుంది. బ్లాక్ చేసిన డబ్బు వినియోగదారుడి ఖాతాలోనే ఉంటుంది. ట్రేడ్ జరిగే వరకూ దాని మీద వడ్డీ అందుతుంది. ట్రేడింగ్ పూర్తయిన తర్వాత యూపీఐ పిన్ అవసరం లేకుండానే అవసరమైన మొత్తాన్ని తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రయోజనాలు

  • యూపీఐ ట్రేడింగ్ బ్లాక్ ల వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. బ్రోకర్లకు నిధులను బదిలీ చేయాల్సిన అవసరం లేదు. వాటిని బ్యాంకు ఖాతాలోనే బ్లాక్ చేసుకోవచ్చు.
  • ప్రముఖ బ్యాంకుల మద్దతుతో పేటీఎం యాప్ లో బ్లాక్ చేసిన నిధులను ఒకే చోట చాలా సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు.
  • ట్రేడింగ్ పూర్తయ్యే వరకూ నిధులు బ్యాంకు ఖాతాలో ఉంటాయి కాబట్టి తద్వారా వడ్డీని సంపాదించుకోవచ్చు.
  • ట్రేడింగ్ సమయంలో యూపీఐ పిన్ అవసరం లేకుండానే లావాదేవీలను వేగవంతంగా జరపవచ్చు.

ట్రేడింగ్ బ్లాక్ ను ప్రారంభించే విధానం

  • ముందుగా మీ బ్రోకింగ్ ప్లాట్ ఫాం ఖాతాకు లాగిన్ అవ్వాలి.
  • నిధులను జోడించు అనే విభాగానికి వెళ్లాలి.
  • సింగిల్ బ్లాక్ మల్టిపుల్ డెబిట్స్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • అందుబాటులో ఉన్న చెల్లింపు ఎంపికల నుంచి పేటీఎం యాప్ ను ఎంచుకోవాలి.
  • ప్రక్రియ పూర్తి కావడానికి మీ యూపీఐ పిన్ నంబర్ ను నమోదు చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి