AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komaki X3: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. అదరగొడుతున్న కొమాకి నయా ఈవీ స్కూటర్

భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు వాడే వారి సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యులు ఈవీ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ ఈవీ వాహనాల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలును ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ అన్ని కంపెనీలు తక్కువ ధరలో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి.

Komaki X3: మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. అదరగొడుతున్న కొమాకి నయా ఈవీ స్కూటర్
Komaki X3
Nikhil
|

Updated on: Mar 05, 2025 | 8:00 PM

Share

ప్రముఖ్య ఈవీ కంపెనీ కొమాకీ తాజాగా ఎక్స్-3 పేరుతో కేవలం రూ.52,999 ధరతో కొత్త ఈవీ స్కూటర్‌ను లాంచ్ చేసింది.  ఈ స్కూటర్ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఎక్స్-3 ఎస్ఈ, ఎక్స్- వన్, ఎంజీ సిరీస్ వేరియంట్స్‌‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కొమాకీ ఈవీ బై-2 @ 999 అనే ఆఫర్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ముఖ్యంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఎక్స్-3 స్కూటర్ భారతదేశంలోని కొమాకీ అధీకృత డీలర్స్ వద్ద అలాగే ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్స్‌లో అందుబాటులో ఉంటుందని కోమాకి పేర్కొంది.

కోమాకి ఎక్స్-3 స్కూటర్ ఆకట్టుకునే డిజైన్‌తో వస్తుంది. అలాగే ఈ ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ ఆకట్టుకుంటుంది.ఈ స్కూటర్‌లో డ్యూయల్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లతో పాటు డిజిటల్ డాష్ బోర్డ్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, పార్కింగ్ రిపేర్ అసిస్ట్, రివర్స్ అసిస్ట్ మొదలైన ఫీచర్లు ఆకర్షిస్తున్నాయి. ఈ స్కూటర్ మూడు వేర్వేరు రంగు ఎంపికల్లో లభిస్తుంది. గార్నెట్ రెడ్, సిల్వర్ గ్రే, జెట్ బ్లాక్ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కోమాకి ఎక్స్-3 స్కూటర్‌లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 3 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటారుతో రావడం వల్ల ఓ సారి ఫుల్‌గా  ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ స్కూటర్ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. 

కోమాకి ఎక్స్-3 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా కోమాకి ఎలక్ట్రిక్ వెహికల్స్ సహ వ్యవస్థాపకురాలు గుంజన్ మల్హోత్రా మాట్లాడుతూ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను మహిళా రైడర్ల అవసరాలను తీర్చడానికి ప్రత్యేకంగా రూపొందించామని  చెప్పారు. ఈ కొత్త ఎక్స్-3 సిరీస్‌ను ప్రారంభించడం అనేది దేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల విప్లవాన్ని నడిపించడంలో మరో మైలురాయిగా పరిగణించవచ్చని పేర్కొన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు నూతన వేరియంట్స్‌లో ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నామని వివరించారు. . మహిళా రైడర్ల అవసరాలను తీర్చడానికి ఎక్స్-3 వేరింయట్‌ను ప్రత్యేకంగా రూపొందించామని స్పష్టం చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే