Mobile Recharge: రోజూ 3GB డేటా, 70 రోజుల వ్యాలిడిటీ.. అతి చౌకైన ప్లాన్..!

Mobile Recharge Plans: తక్కువ ధరల్లో ఎక్కువ వ్యాలిడిటీ ఇచ్చే రీఛార్జ్‌ ప్లాన్‌ ఏ టెలికాం కంపెనీ అందిస్తుందో తెలుసా..? కేవలం 299 రూపాయలతో ప్రారంభం అయ్యే ఈ ప్లాన్‌లో ఎక్కువ వ్యాలిడిటీ, ఎక్కువ డేటాను పొందవచ్చు. అలాగే జియో, ఎయిర్ టెల్..

Mobile Recharge: రోజూ 3GB డేటా, 70 రోజుల వ్యాలిడిటీ..  అతి చౌకైన ప్లాన్..!
Mobile Recharge Plans

Updated on: Jun 06, 2026 | 3:57 PM

Mobile Recharge Plan: మీ రోజు వారి డేటా సరిపోకపోతే ఎక్కువ డేటా ఉన్న ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే తక్కువ ధరల్లోనే రోజుకు 3GB డేటా ఉన్న ప్లాన్‌ను తీసుకుంటే ఎంతో ఉత్తమం. మీరు జియో, ఎయిర్‌టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్ నుండి రోజుకు 3GB డేటాతో లభించే చౌకైన రీఛార్జ్‌లను తెలుసుకోండి. అత్యంత చౌకైన ప్లాన్ ధర రూ.299 అందుబాటులో ఉంది.

BSNL రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు ప్రతిరోజూ 3GB డేటా (మొత్తం 90GB), అపరిమిత కాల్స్, 100 SMS మెసేజ్‌లను అందిస్తుంది. మీరు BSNL సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే మీకు అదనంగా 3GB డేటా లభిస్తుంది.

జియో రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజూ 3GB డేటా (మొత్తం 84GB), అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMS మెసేజ్‌లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాలలో అపరిమిత 5G డేటా, జియో టీవీ, జియో ఏఐ క్లౌడ్, 3 నెలల పాటు ఉచిత జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 18 నెలల పాటు ఉచిత గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

BSNLరూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్

BSNL రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు ప్రతిరోజూ 3GB డేటా (మొత్తం 210GB), అపరిమిత కాల్స్, 100 SMS మెసేజ్‌లను అందిస్తుంది. మీకు తక్కువ ధరలో ఎక్కువ డేటాతో పాటు ఎక్కువ వ్యాలిడిటీ కావాలంటే ఈ ప్లాన్ మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు.

Vi రూ.795 ప్రీపెయిడ్ ప్లాన్

Vi వారి రూ. 795 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజూ 3GB డేటా (మొత్తం 168GB), అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMS మెసేజ్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో అపరిమిత 5G డేటా, Vi మూవీస్,టీవీ (19 OTT ప్లాట్‌ఫారమ్‌లు) యాక్సెస్, హాఫ్-డే అపరిమిత డేటా (ఉదయం 12 నుండి రాత్రి 12 వరకు), వీకెండ్ డేటా రోల్‌ఓవర్, డేటా డిలైట్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఎయిర్‌టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 838 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులకు ప్రతిరోజూ 3GB డేటా (మొత్తం 168GB), అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 SMS మెసేజ్‌లు లభిస్తాయి. అదనపు ప్రయోజనాలలో అపరిమిత 5G డేటా, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే (సోనీ LIV + 20 OTTలు), అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ (12 నెలల పాటు), ఉచిత హలోట్యూన్స్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: IRCTC: వీరు ఇక రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ..!

ఇది కూడా చదవండి: School Holidays: తెలంగాణలో విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వేసవి సెలవుల పొడిగింపు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us