భారత ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) పేరుతో పొదుపు పథకాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. తక్కువ రిస్క్‌తో రిటర్న్స్ పొందే అవకాశం ఉన్న ఈ పొదుపు పథకాన్ని ఉద్యోగులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో ఉన్న వారికి, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారికి శుభవార్త తెలిపింది. జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి గాను వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 6.8 శాతం వడ్డీగా చెల్లిస్తున్నారు. అయితే జనవరి నుంచి ఈ వడ్డీ రేటును 7 శాతానికి పెంచుతూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది.
రిస్క్ తక్కువగా ఉండే ఈ పొదుపు పథకాన్ని ఇండియన్ పోస్టాఫీస్ అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి వార్షీకంగా 7 శాతం వడ్డీని అందిస్తారు. ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఎలాంటి పరిమితి ఉండదు. అయితే రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టిన వారికి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. మెచురిటీ పీరియడ్ 5 ఏళ్లుగా ఉంటుంది. ఈ పథకంలో భారతీయులు ఎవరైనా చేరొచ్చు. స్థానికంగా ఉండే పోస్టాఫీస్‌ను సందర్శించడం ద్వారా ఈ పథకంలో చేరొచ్చు.
* ఇందుకోసం ముందుగా ఇండియన్ పోస్టల్ ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం ఎన్‌ఎస్‌సీ అకౌంట్‌లోకి వెళ్లి ఓపెన్ ఎన్‌ఎస్‌సీ అకౌంట్ అండ్ కేవీపీ అకౌంట్ ఓపెన్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత అకౌంట్ ఓపెనింగ్ కోసం కనీసం రూ. 1000ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* అనంతరం పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు లింక్ అయిన డెబిట్ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* చివరిగా టర్మ్స్ అండ్ కండిషన్స్‌పై క్లిక్ చేసి సబ్‌మిట్ ఆన్‌లైన్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..