Interest Rates: పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్ ఆఫర్.. ఆ పథకాలపై నమ్మలేని వడ్డీ
నూతన సంవత్సరానికి ముందు ప్రభుత్వం జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ వంటి కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచగా, మూడేళ్ల కాల డిపాజిట్‌ను 7.1 శాతానికి పెంచింది.
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహించేలా ప్రజలకు పెద్ద కానుకను అందించింది. నూతన సంవత్సరానికి ముందు ప్రభుత్వం జనవరి-మార్చి 2024 త్రైమాసికంలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), 3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ వంటి కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. ఈ మేరకు ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అనేక చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటును 8.2 శాతానికి పెంచగా, మూడేళ్ల కాల డిపాజిట్‌ను 7.1 శాతానికి పెంచింది. ఇంతకుముందు సుకన్య సమృద్ధి యోజన వడ్డీ 8 శాతం, మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై వడ్డీ 7.1 శాతంగా పెంచారు. గత మూడేళ్లుగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. కేంద్ర ప్రభుత్వం తాజా నోటిఫికేషన్ ప్రకారం ఏయే పథకాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓ సారి తెలుసుకుందా.
పీపీఎఫ్ వడ్డీ తగ్గింపు
పీపీఎఫ్ వడ్డీలో చివరి మార్పు ఏప్రిల్-జూన్ 2020లో 7.9 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గించారు. గతసారి ఐదేళ్ల ఆర్డీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఇటీవల ప్రకటనకు ముందు కేంద్ర ప్రభుత్వ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు 4 శాతం నుంచి 8.2 శాతం మధ్య ఉండేవి.
జనవరి-మార్చి తాజా వడ్డీ రేట్లు ఇవే
- పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాపై 4 శాతం వడ్డీ
- ఒక సంవత్సరం కాల డిపాజిట్ వడ్డీ రేటు 6.9 శాతం
- సంవత్సరాల కాల డిపాజిట్ వడ్డీ రేటు 7.0 శాతం
- 3 సంవత్సరాల కాల డిపాజిట్ వడ్డీ రేటు 7.1 శాతం
- 5 సంవత్సరాల కాల డిపాజిట్‌పై వడ్డీ 7.5 శాతం
- 5 సంవత్సరాల RD పథకంపై వడ్డీ 6.7 శాతం
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ 7.7 శాతం
- కిసాన్ వికాస్ పత్ర వడ్డీ 7.5 శాతం
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వడ్డీ 7.1 శాతం
- సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్‌ఎస్‌వై) వడ్డీ 8.2 శాతం
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ 8.2 శాతం
ఆ వడ్డీ రేట్ల విషయంలో నో చేంజ్
చిన్న పొదుపు పథకాల కింద, సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే టైమ్ డిపాజిట్లు మాత్రమే జనవరి-మార్చి 2024 త్రైమాసికానికి వడ్డీని పెంచాయి. అన్ని ఇతర చిన్న పొదుపు పథకాలు యథాతథంగా ఉంచారు. బ్యాంక్ ఎఫ్‌డీపై వడ్డీ కంటే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి