కాస్త మొండిగా వ్యవహరించింది.. అయినా తప్పలేదు.. కొత్త ఐటీ రూల్స్‌కు ఓకే చెప్పిన ట్విట్టర్

Twitter: కాస మొండికేసింది.. బెట్టు చేసింది. చివరికి దిగివచ్చింది ట్విట్టర్ పిట్ట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానాలకు ట్విట్టర్ అంగీకరించింది.

కాస్త మొండిగా వ్యవహరించింది.. అయినా తప్పలేదు.. కొత్త ఐటీ రూల్స్‌కు ఓకే చెప్పిన ట్విట్టర్

Updated on: May 31, 2021 | 4:36 PM

కాస మొండికేసింది.. బెట్టు చేసింది. చివరికి దిగివచ్చింది ట్విట్టర్ పిట్ట. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ విధానాలకు ట్విట్టర్ అంగీకరించింది. సామాజిక మాధ్యమాల కట్టడికి ట్విట్టర్ యాజమాన్యం ఎట్టకేలకు అంగీకరించింది. ఈ చట్టం ప్రకారం ట్విట్టర్‌కు ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రత్యేక అధికారిని మే 28న నియమించినట్లు సోమవారం ఢిల్లీ హైకోర్టు ముందు వివరణ ఇచ్చుకుంది. ఇప్పటికే ఫేస్‌బుక్ సహా పలు సోషల్ మీడియా, ఓటీటీ సంస్థలు ఈ నియమావళిని అంగీకరించాయి. అయితే వీటిలో కొన్ని మార్పులు చేయాలంటూ ప్రతిపాదనలు పెట్టాయి. ఈ విషయంలో ట్విట్టర్ యాజమాన్యం కాస్త మొండిగా వ్యవహరించింది.

సామాజిక మాధ్యమాల కట్టడికి మూడు నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 25న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వాటి అమలుకు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువు మే 25తో ముగియడంతో కేంద్ర ప్రభుత్వం మే 26న రంగంలోకి దిగింది. సవరించిన నిబంధనల అమలుకు సామాజిక మాధ్యమాలు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించింది. అయితే అప్పటి వరకు మౌనంగా ఉన్న ఫేస్‌బుక్ ఉన్నట్లుండి కేంద్ర నియమావళికి ఓకే చెప్పేసింది. అయితే ఇదే సమయంలో ట్విట్టర్ కార్యాలయంలో ఢిల్లీ పోలీసులు తనిఖీకి రావడం సంచలనంగా మారింది. అనంతరం తమ ఉద్యోగుల భద్రతపై, వాక్స్వాతంత్ర్యానికి కలుగుతున్న ముప్పుపై ఆందోళన కలుగుతోందని ట్విట్టర్ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటనపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ట్విటర్‌ చేసిన ప్రకటన భారతదేశాన్ని అపఖ్యాతిపాలు చేసేవిధంగా ఉందని.. ఇది ప్రపంచంలోనే  అతి పెద్ద ప్రజాస్వామ్యంపై తన షరతులను రుద్దే ప్రయత్నమని మండిపడింది. ట్విటర్‌ నేరుగా విషయానికి రావాలని.. ఈ దేశ చట్టాలకు లోబడి పని చేయాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:  సిద్దిపేట జిల్లాలో వికసించిన మానవత్వం.. ముగ్గురు కొడుకులున్నా ముందుకురానివైనం.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు

I-T Department ALERT: ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు ఈ-ఫైలింగ్ సేవలు క్లోజ్.. తిరిగి ఎప్పటి నుంచి అంటే…

TTD Announced: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇవాళ్టి నుంచి అలిపిరి మెట్ల మార్గం మూసివేత

 Hyderabad Metro Rail services : లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీస్‌ల వేళల్లో మార్పులు