Quantum energy: ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే సెల్ ఫోన్ ఫ్రీ.. ఆ కంపెనీ పండుగ ఆఫర్ అదిరిందిగా..!

|

Jan 11, 2025 | 4:15 PM

పండగలను ఘనంగా జరుపుకోవడం మన భారతీయుల ఆనవాయితీ. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వైభవంగా నిర్వహించుకుంటారు. పండగ అనగానే కొత్త బట్టలు, పిండి వంటలు, సరదాలు తప్పకుండా ఉంటాయి. వాటితో పాటు వాహనాలను కొనుగోలు చేయడానికి చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు. పండగ సమయంలో కొనుగోలు చేసిన వాహనాలు ఒక తీపి గుర్తుగా నిలిపోతాయి. క్యాంటర్ ఎనర్జీ కంపెనీ నుంచి వివిధ మోడళ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లు విడులయ్యాయి. ఆధునాతన పనితీరు, పర్యావరణ అనుకూల టెక్నాలజీతో ఆకట్టుకుంటున్నాయి.

Quantum energy: ఎలక్ట్రిక్ స్కూటర్ కంటే సెల్ ఫోన్ ఫ్రీ.. ఆ కంపెనీ పండుగ ఆఫర్ అదిరిందిగా..!
Quantum Energy
Follow us on

సంక్రాంతి సందర్బంగా అంతటా సందడి నెలకొంది. మార్కెట్ లో వివిధ రకాల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. దుస్తులు, బంగారు ఆభరణాలు, ఎలక్ట్రికల్ సామగ్రిపై ప్రత్యేక తగ్గింపు ధరలు ప్రకటించారు. ఇదే కోవలో ఎలక్ట్రిక్ స్కూటర్లపై వివిధ రాయతీలు అందిస్తున్నారు. ప్రముఖ కంపెనీ అయిన క్వాంటర్ ఎనర్జీ తన కొనుగోలు దారులకు స్పెషల్ బహుమతి అందజేస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లను కొనుగోలు చేసిన వారికి రూ.15 వేలు విలువైన స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తోంది. 2024 డిసెంబర్ 18న ప్రారంభమైన ఈ ఆఫర్ 2025 జనవరి 18వ తేదీ వరకూ కొనసాగుతుంది.

ఆ మోడల్స్ ఇవే

  • ప్లాస్మా ఎక్స్ మోడల్ 1500 డబ్ల్యూ మోటారు ద్వారా శక్తిని పొందుతుంది. ఒక్కసారి రీచార్జి చేస్తే 120 కిలోమీటర్లు పరిగెడుతుంది. గంటకు 65 కిలోమీటర్ల గరిష్టం వేగంతో ప్రయాణం చేయవచ్చు.
  • ప్లాస్మా ఎక్స్ ఆర్ మోడల్ లో 1500 డబ్ల్యూ మోటారు అమర్చారు. దీని వేగం గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. సింగిల్ రీచార్జితో వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
  • మిలన్ మోడల్ స్కూటర్ లో 100 డబ్ల్యూ మోటారు అమర్చారు. దీని వేగం కూడా గంటకు 60 కిలోమీటర్లు ఉంటుంది. సింగిల్ చార్జింగ్ తో వంద కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
  • బిజినెస్ ఎక్స్ మోడల్ లో 1200 డబ్ల్యూ మోటారు ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు, పూర్తిస్థాయి చార్జింగ్ తో 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
  • బిజినెస్ ఎక్స్ పీ మోడల్ ప్రత్యేకతల్లోకి వెళితే 1200 డబ్ల్యూ మోటారు,45 కిలోమీటర్ల గరిష్ట వేగం, 135 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది.

క్వాంటర్ ఎనర్జీ డైరెక్టర్ చేతన చుక్కపల్లి మాట్లాడుతూ పండగ సమయంలో అదనపు ప్రయోజనాలతో స్కూటర్ ను అందించడం కోసం ఆఫర్ తీసుకువచ్చామన్నారు. పర్యావరణ అనుకూలమైన, అధునాతన స్కూటర్లను అందించడం తమ లక్ష్యమన్నారు. అలాగే ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ స్కూటర్లను టెస్ట్ డ్రైవ్ చేయవచ్చన్నారు. కంపెనీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో టెస్ట్ రైడ్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు. లేకపోతే సమీపంలోని షోరూమ్ లను సందర్శించవచ్చని తెలిపారు. కాగా.. క్వాంటమ్ ఎనర్జీ ఆటోమోటివ్ పరిశ్రమను 2022లో ప్రారంభించారు. అప్పటి నుంచి 10 వేల యూనిట్లను విక్రయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి