AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ITR Returns Filing: ఈ గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!

ITR Returns Filing: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పలు కేటగిరిల పన్ను..

ITR Returns Filing: ఈ గడువులోగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసుకోండి.. లేకపోతే ఇబ్బందే..!
Income Tax Return
Subhash Goud
|

Updated on: Feb 09, 2022 | 11:35 AM

Share

ITR Returns Filing: ఆదాయపు పన్నుకు సంబంధించిన కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. పలు కేటగిరిల పన్ను చెల్లింపుదారులకు పన్ను ఆడిట్‌ నివేదికలు, ఆదాయ పన్ను రిటర్నులనుదాఖలు చేసే గడువు కూడా విధించింది కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు (CBDT). ప్రస్తుతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లను దాఖలు చేసేందుకు 15 మార్చి 2022 గడువు ఉంది. ట్యాక్స్‌ ఆడిట్‌ రిపోర్టులను దాఖలు చేసే గడువు 15 ఫిబ్రవరి 2022.

అయితే కరోనా కేసుల కారణంగా కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లో సమస్యలు తలెత్తడంతో ఈ గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు ఆర్థిక మంత్రిశాఖను కోరడంతో ఈ గడువు పెంచింది సీబీడీటీ. కరోనా, ఇతర కారణాల వల్ల పన్ను చెల్లింపుదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని.. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రొవిజన్ల కింద ఆర్థిక సంవత్సరం 2020-21 కోసం దాఖలు చేయాల్సిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు, ఆడిట్ రిపోర్టుల పొడిగించింది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. ఇక ఆడిట్‌ రిపోర్టును సమర్పించేందుకు గడువు కూడా దగ్గర పడుతోంది. ఇక ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు కూడా ఇంకా నెల రోజుల వరకు సమయం ఉంది. గతంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేందుకు తుది గడువు 31 డిసెంబర్‌, 2021 ఉండేది. పన్ను చెల్లింపుదారుల కోరిక మేరకు కేంద్రం ఈ గడువును పొడిగించింది.

గడువు ముగిసిన తర్వాత దాఖలు చేస్తే జరిమానా..

కాగా, గడువు ముగిసిన తర్వాత ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లయితే రూ.5వేల వరకు జరిమానా విధిస్తున్నారు. ప్రస్తుతం రిటర్న్‌ దాఖలు చేసేందుకు సమయం ఉంది కాబట్టి ఎలాంటి జరిమానా చెల్లించకుండా దాఖలు చేసుకోవచ్చు. ఇలాంటి ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉంటే జరిమానాతో పాటు పనులు సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా, ఆదాయపు పన్ను, బ్యాంకింగ్ రంగాలలో ఇలాంటి ప్రభావం చాలా ఉంటుంది. ముందస్తుగా పనులు చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

ఇవి కూడా చదవండి:

Bharti Airtel Q3 Results: ఎయిర్‌టెల్‌ త్రైమాసిక ఫలితాలు.. 2.8 శాతం తగ్గిన లాభం..!

Credit Score: రుణాలు, క్రెడిట్‌ కార్డు బకాయిలు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? ఇలా చేస్తే నష్టమే..!