India Car Sales: కారు కొనే వారిలో కొత్త ఆలోచన.. సెంచరీ దాటిన ఇంధన ధరల పర్యావసానం…

కొత్త కారు కొనాలనుకునే వారి ఆలోచనలో గత కొంత కాలంగా మార్పు వస్తోంది. పెట్రోల్ వెర్షన్ కార్ల కంటే డీజిల్ కార్ల కొనుగోలుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు.

India Car Sales: కారు కొనే వారిలో కొత్త ఆలోచన.. సెంచరీ దాటిన ఇంధన ధరల పర్యావసానం...
Hyundai Cars
Follow us

|

Updated on: Aug 18, 2021 | 7:10 PM

కొత్త కారు కొనాలనుకునే వారి ఆలోచనలో గత కొంత కాలంగా మార్పు వస్తోంది. పెట్రోల్ వెర్షన్ కార్ల కంటే డీజిల్ కార్ల కొనుగోలుకే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. పెట్రోల్ ధర సెంచరీ మార్కును దాటడమే కస్టమర్స్ ఆలోచనలో మార్పునకు కారణమని ఆటోమొబైల్ సంస్థలు నిర్థారణకు అచ్చాయి. ఆ మేరకు ఆటోమొబైల్ సంస్థ తమ స్ట్రాటజీని మార్చుతున్నాయి. పెట్రోల్ కార్ల ఉత్పత్తిని తగ్గించి డీజిల్ కార్ల ఉత్పత్తిని పెంచడంపై ఫోకస్ పెడుతున్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో డీజిల్ కార్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ ఇండియా డైరెక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) తరుణ్ గార్గ్ తెలిపారు. పెట్రోల్ వెర్షన్స్‌తో పోల్చితే డీజిల్ మోడల్ కార్లు 30 శాతం అధిక ఫ్యూయల్ ఎఫిషియన్ట్‌గా ఉంటాయి.. అంటుకే డీజిల్ మోడల్ కార్ల కొనుగోలుకు ఎక్కవగా మొగ్గుచూపుతున్నట్లు ఆయన వివరించారు.

అటు ఇంధన ధరల పెరుగుదలపై ఆటోమొబైల్ సంస్థలు ఆందోళన చెందుతున్నట్లు తరుణ్ గార్గ్ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటం కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో ఎస్‌యూవీ కార్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు చెప్పారు. ఎస్‌యూవీ కేటగిరీలో మొత్తం కార్ల విక్రయాల్లో హ్యుండాయ్ కార్ల వాటా 47 శాతం ఉన్నట్లు వివరించారు. 2021లో కరోనా సెకండ్ వేవ్ కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపినమాట వాస్తవమేనని అన్నారు. అయితే ప్రస్తుతం కార్ల విక్రయాలు సెకండ్ వేవ్ మునుపటి స్థాయిలో ఉంటున్నట్లు సంతృప్తి వ్యక్తంచేశారు.

Hyundai

Hyundai

దేశంలో హ్యుందాయ్ కంపెనీకి 17.4 శాతం మార్కెట్ షేర్ ఉన్నట్లు వివరించారు. గత 25 ఏళ్ల హ్యుందాయ్ చరిత్రలో ఇది అత్యధికంగా తెలిపారు. గత రెండేళ్లలో దేశంలో హ్యుందాయ్ పది ప్రోడక్ట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. దేశ ఆటోమొబైల్ రంగంలో అగ్రస్థానంలో నిలవడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. కొత్త వాహనాలను లాంఛ్ చేస్తుండటంతో ఈ ఏడాది తమ సంస్థ మార్కెట్ వాటా మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

మరో మూడేళ్లలో ఎలక్ట్రిక్ కారును హ్యుందాయ్ సంస్థ భారత్‌లో పరిచయం చేసే అవకాశం ఉందని హ్యుందాయ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీహెచ్ పార్క్ తెలిపారు. పాండమిక్ నేపథ్యంలోనే టెక్నాలజీపై భారీ స్థాయిలో సంస్థ పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు.

Also Read..

ఆన్‌లైన్ వేలంలో టిష్యూ పేపర్ ధర రూ.7.50 కోట్లు.. ఎవరు వాడి పడేసిందో తెలుసా?

చెట్టుపై మాటు వేసిన చిరుత.. ఊహించని రీతిలో ఎటాక్ చేసింది.. వీడియో చూస్తే హడిలిపోవాల్సిందే..

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మన సినిమాలను హిందీలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎవరో తెలుసా..
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!
మితిమీరిన సంబరాలతో అడ్డంగా బుక్కైన ఢిల్లీ పేసర్..!