Canara Bank: లోన్‌ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త.. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు! వివరాలివే..

|

May 29, 2021 | 2:12 PM

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ తాజాగా కస్టమర్ల..

Canara Bank: లోన్‌ తీసుకోవాలనుకునే వారికి శుభవార్త.. 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు! వివరాలివే..
Canara Bank
Follow us on

మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకో శుభవార్త. ప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ తాజాగా కస్టమర్ల కోసం కొత్త లోన్ స్కీమ్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా మూడు రకాల రుణాలు ఆఫర్ చేస్తోంది. అవేంటంటే హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్.. ఈ స్కీమ్స్‌ ద్వారా చాలామందికి ప్రయోజనం కలగనుంది. ప్రత్యేకించి కరోనా టైమ్‌లో లోన్ తీసుకోవాలనుకునే వారికి ఊరట లభించనుంది.

కెనరా చికిత్స హెల్త్‌కేర్ క్రెడిట్ ఫెసిలిటీ కింద హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం 10 లక్షల నుంచి 50 కోట్ల రూపాయల వరకు బ్యాంక్ నుంచి రుణాలు పొందొచ్చు. దానికి అతి తక్కువ వడ్డీ రేటు లభిస్తుందని బ్యాంక్ వెల్లడించింది. అలాగే తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలో తిరిగి కట్టాలి. అంతేకాకుండా 18 నెలల వరకు మారటోరియం పొందొచ్చు.

ఇకపోతే మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు వంటివి తయారు చేసే సంస్థలకు బ్యాంక్ 2 కోట్ల రూపాయల వరకు రుణాలు అందిస్తోంది. కెనరా జీవన రేఖ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ కింద ఈ తరహా రుణాలు పొందొచ్చు. ఈ రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. అంతేకాకుండా కెనరా బ్యాంక్ 5 లక్షల వరకు పర్సనల్ లోన్స్ కూడా అందిస్తోంది. కెనరా సురక్ష పర్సనల్ లోన్ స్కీమ్ కింద ఈ తరహా రుణాలు పొందొచ్చు. 25 వేల నుంచి 5 లక్షల వరకు ఈ లోన్ తీసుకోవచ్చు. దీనికి 6 నెలలు ఈఎంఐ కట్టక్కర్లేదు. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండటంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉంది.

Also Read:

Viral News: వామ్మో 16 గంటల స్నానం.. ఆ మహిళ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానాలిస్తున్న నెటిజన్లు..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్.. ప్రయాణీకులు లేక.. పలు ప్రత్యేక రైళ్లు రద్దు.. వివరాలివే..

TS Eamcet: తెలంగాణ ఎంసెట్ వాయిదా పడే అవకాశం.! ఆగష్టులో నిర్వహణ.!!