Investment Tips: క్రెడిట్ కార్డుతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా..? ఆ విషయం తెలుసుకోకపోతే మీ సొమ్ము ఫసక్..!

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువ. ముఖ్యంగా మెట్రో నగరంలో ఉద్యోగులకు ప్రతి ఒక్కరికీ క్రెడిట్ కార్డు ఉండడం అనేది సర్వసాధారణంగా మారింది. అయితే చాలా మంది యువత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ క్రెడిట్ కార్డు ద్వారా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టవచ్చా? అనే అనుమానం అందరికీ ఉంటుంది. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుతో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే పర్యావసానాలను తెలుసుకుందాం.

Investment Tips: క్రెడిట్ కార్డుతో స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా..? ఆ విషయం తెలుసుకోకపోతే మీ సొమ్ము ఫసక్..!
Credit Card
Follow us
Srinu

|

Updated on: Nov 06, 2024 | 3:30 PM

క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం భారతదేశంలో అనుమతించరని నిపుణులు చెబుతున్నారు. స్టాక్ బ్రోకర్లు కస్టమర్‌కు సంబంధించిన సేవింగ్స్ ఖాతా ద్వారా మాత్రమే డబ్బును స్వీకరించాలని సెబీ ఆదేశించింది. సెబీ నిబంధనలు పెట్టుబడిదారులను రక్షించడానికి, ప్రమాదకర ఆర్థిక పరిస్థితులను నిరోధించడానికి రూపొందించారని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డ్‌లు లేదా పర్సనల్ లోన్‌ల నుంచి నగదు ఉపసంహరణ వంటి అరువు తీసుకున్న నిధులను పెట్టుబడి కోసం ఉపయోగించడం వల్ల అధిక వడ్డీ రేట్లు, మార్కెట్ అస్థిరత కారణంగా తీవ్రమైన ఆర్థిక పరిణామాలకు దారితీయవచ్చు. ఎవరైనా అలా చేయడానికి ఒక మార్గాన్ని అందించాలని క్లెయిమ్ చేసినప్పటికీ అలాంటి పద్ధతులు నియంత్రణ ప్రమాణాలకు విరుద్ధమని గుర్తించడం చాలా ముఖమని చెబుతున్నారు. 

అరువు తెచ్చుకున్న డబ్బుతో పెట్టుబడి పెట్టడం అనేది సహజంగానే ప్రమాదకరమనే విషయాన్ని నిపుణులు హైలేట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడం వల్ల అధిక వడ్డీ రేట్లతో పాటు జరిమానాల కారణంగా ఈ రిస్క్‌లు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు ద్వారా పెట్టుబడితో ఎంత మేరకు నష్టపోతామో? ఓసారి చూద్దాం.

అధిక వడ్డీ రేట్లు

భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు 13 శాతం నుంచి 48 శాతం వరకు ఉంటాయి. ఇది పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలను త్వరగా తగ్గించవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తమ బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించడంలో విఫలమైతే వారు గణనీయమైన వడ్డీ ఛార్జీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

లోన్ టెన్యూర్

పెట్టుబడులకు రాబడి సరిగ్గా రాకపోతే అప్పుల్లో చిక్కుకు పోవాల్సి వస్తుంది.  ఉదాహరణకు ఒక పెట్టుబడిదారుడు రూ. 100 విలువైన స్టాక్‌లను క్రెడిట్‌పై కొనుగోలు చేసి వాటి విలువ రూ. 60కి పడిపోతే వారు పెట్టుబడిపై నష్టాన్ని చవిచూడడమే కాకుండా అసలు మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి రావడంతో అప్పులు పాలు కావాల్సి వస్తుంది. 

క్రెడిట్ స్కోర్‌

క్రెడిట్ కార్డ్ చెల్లింపులను బాధ్యతాయుతంగా నిర్వహించడంలో విఫలమైతే  క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి