AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutual Funds: ఒక్క ఫార్ములాతో మీరే కోటీశ్వరుడు.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో కళ్లు చెదిరే లాభాలు

భారతదేశంలోని ప్రజలు చాలా ఏళ్లుగా పొదుపు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఏళ్లుగా స్థిర ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో పెట్టుబడి పెడుతున్నారు. కానీ ఇటీవల పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో యువత ఎక్కువగా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి ద్వారా కోటీశ్వరుడు ఎలా కావాలో? ఓ సారి తెలుసుకుందాం.

Mutual Funds: ఒక్క ఫార్ములాతో మీరే కోటీశ్వరుడు.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో కళ్లు చెదిరే లాభాలు
Mutual Fund Investments
Nikhil
|

Updated on: Nov 06, 2024 | 3:19 PM

Share

పెట్టుబడిదారుల్లో చాలా మంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపు మంత్రం జపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలున్న వాళ్లు వారు చదువుకు లేదా వారి భవిష్యత్ అవసరాలకు పెట్టుబడి మార్గం ఎంచుకుంటూ ఉంటారు. అయితే పిల్లల ఉన్నత చదువులకు వచ్చేసరికి మన కోటి రూపాయలు ఉంటే ఎలా ఉంటుంది? వారిని మంచి కాలేజ్‌లో జాయిన్ చేసి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేయడానికి ఆ సొమ్ము చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రుణం అవసరం లేకుండా పిల్లలను చదివించాలనుకునే వారు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ)లో ఓ ఫార్ములా ద్వాారా పెట్టుబడి  పెడితే కోటి రూపాయాలు మీ సొంతం అవుతాయి. 21 X 10 X 21 ఫార్ములా దారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఇది గొప్ప మార్గం. 

ఈ ఫార్ములా ద్వారా పెట్టుబడి పెట్టి మీరు ఈ వ్యూహాన్ని అనుసరిస్తే మీ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిపై 12 శాతం వార్షిక రాబడిని సంపాదించవచ్చు. అంటే మీ పిల్లలకు 21 సంవత్సరాలు నిండినప్పుడు మీరు రూ. 1 కోటి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఫండ్‌ని పొందవచ్చు. 21 X 10 X 21 ఫార్ములా  ఫార్ములా ప్రకారం, మీ బిడ్డ పుట్టినప్పుడు మీరు వారి పేరుతో నెలవారీ రూ.10,000తో ఎస్ఐపీను ప్రారంభించవచ్చు. దానిని మీరు 21 సంవత్సరాల పాటు కొనసాగించాలి. ఈ 21 ఏళ్లలో మీరు 12 శాతం వార్షిక రాబడిని పొందాలి. ఇది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్‌లో కనిపిస్తుంది. గత దశాబ్దంలో, నిఫ్టీ 50 ఇండెక్స్ 14 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. కాబట్టి 12 శాతం రాబడిని అంచనా వేయవచ్చు. 

21 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే మీ మొత్తం పెట్టుబడి రూ.25,20,000 అవుతుంది. 12 శాతం వార్షిక రాబడి ప్రకారం మీ దీర్ఘకాలిక మూలధన లాభం రూ. 88,66,742గా ఉంటుంది. అంటే మీకు ఇది మీకు మొత్తం రూ. 1,13,86,742 (సుమారు ₹ 1.14 కోట్లు) ఇస్తుంది. రూ.కోటి కార్పస్ పొందడానికి, మీరు ప్రతి నెలా రూ. 10,000 కచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. 50:30:20 నియమం ప్రకారం మీ జీతంలో కనీసం 20 శాతం ఆదా చేయాలి. కాబట్టి మీ జీతం రూ.50,000 అయితే మీరు ప్రతి నెలా రూ.10,000 (20 శాతం) ఆదా చేయాల్సి ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి