Tax Saving Tips: ఆ పథకంలో పెట్టుబడితో బోలెడంత పన్ను ఆదా.. ఆ చిట్కా పాటించడం మస్ట్

|

Aug 19, 2024 | 6:30 PM

భారతదేశంలో సాధారణంగా నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయ పన్ను చెల్లించడం అనేది తప్పనిసరి. సాధారణంగా ఎక్కువ ఆదాయం సంపాదించే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెడితే పన్ను ఆదా అనేది చాలా తక్కువ ఉంటుంది.

Tax Saving Tips: ఆ పథకంలో పెట్టుబడితో బోలెడంత పన్ను ఆదా.. ఆ చిట్కా పాటించడం మస్ట్
Tax Saving
Follow us on

భారతదేశంలో సాధారణంగా నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయ పన్ను చెల్లించడం అనేది తప్పనిసరి. సాధారణంగా ఎక్కువ ఆదాయం సంపాదించే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  ఎఫ్‌డీ వంటి పథకాల్లో పెట్టుబడి పెడితే పన్ను ఆదా అనేది చాలా తక్కువ ఉంటుంది. అయితే కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన ఎన్‌పీఎస్ పథకంలో పెట్టుబడిపెడితే రూ. లక్ష కంటే ఎక్కువ పన్ను ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్‌‌పీఎస్ వంటి పథకాల్లో పెట్టుబడితో రిటైర్‌మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో సొమ్ము రిటర్న్స్ పొందడంతో పాటు ప్రస్తుతం పన్ను మినహాయింపులను అధికంగా చేయవచ్చని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌పీఎస్ పథకంలో పెట్టుబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఆదయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీడీ (2) ప్రకారం పెన్షన్ స్కీమ్‌లో పెట్టబడిన ఉద్యోగి ప్రాథమిక జీతంలో 10 శాతం వరకు పన్ను రహితంగా ఉంటుంది. బేసిక్ శాలరీ ఏడాదికి 13,48,00 వచ్చే ఉద్యోగికి అతని కంపెనీ ప్రతి నెలా ఎన్‌పీఎస్‌లో రూ.11,233 (అతని ప్రాథమిక చెల్లింపులో 10%) కడుతుంది. ఇలా చేయడం ద్వారా అతని వార్షిక పన్ను దాదాపు రూ.42,000 తగ్గుతుంది. సెక్షన్ 80సీసీడీ(1బి) కింద సొంతంగా రూ.50,000 పెన్షన్ పథకంలో పెట్టుబడి పెడితే మరో రూ.15,600 ఆదా అవుతుంది. అయితే ఉద్యోగికి 47 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతను సాంప్రదాయిక కేటాయింపును కలిగి ఉండాలి. కానీ అతనికి ఇతర ఈక్విటీ ఎక్స్‌పోజర్ లేనందున అతను ఈక్విటీ ఫండ్‌లలో గరిష్టంగా 75 శాతం కార్పస్‌ను మాత్రమే ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. 

ఒకవేళ ఆ ఉద్యోగికి దాదాపు రూ.18 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కలిగి ఉన్నాయనుకుంటే వడ్డీ కింద ఏడాదికి రూ.1.24 లక్షలు వస్తుంది. సంపాదించిన వడ్డీపై ఆ ఉద్యోగి దాదాపు రూ.39వేలు పన్ను చెల్లించాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లోకి మారితే ఏడాదికి రూ.1.25 లక్షల వరకు పన్ను రహిత రిటర్న్‌లను పొందగలుగుతారు. అతని కంపెనీ అతనికి వార్తాపత్రిక, పుస్తకాల అలవెన్స్ అందిస్తే మరింత పన్ను ఆదా అవుతుంది. అతను నెలకు రూ.2,000 వార్తాపత్రిక భత్యం పొందితే అతని వార్షిక పన్ను దాదాపు రూ.7,500 తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి