Digital Gold: స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే బంగారం కొనుగోలు.. ఆ యాప్ ద్వారా మరింత సులభం

భారతదేశంలోని ప్రజలకు బంగారం అంటే ప్రత్యేక మక్కువ ఉంటుంది. బంగారాన్ని పెట్టుబడి ఆప్షన్‌గా మాత్రమే కాకుండా ఆభరణాల కింద వాడుతూ ఉంటారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా బంగారాన్ని పెట్టుబడిగా మాత్రమే చూసే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి వారికి డిజిటల్ గోల్డ్ ప్రత్యామ్నాయంగా మారింది. ప్రస్తుత రోజుల్లో యాప్ ద్వారా కూడా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో డిజిటల్ గోల్డ్‌ను గూగుల్ పే యాప్ ద్వారా ఎలా కొనుగోలు చేయాలో ఓ సారి తెలుసుకుందాం.

Digital Gold: స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇంటి నుంచే బంగారం కొనుగోలు.. ఆ యాప్ ద్వారా మరింత సులభం
Gold Investment
Follow us

|

Updated on: Oct 25, 2024 | 2:20 PM

సాంప్రదాయక బంగారు పెట్టుబడులకు భిన్నంగా ఇటీవల కాలంలో బార్‌లు, నాణేలు లేదా ఆభరణాల రూపంలో అసలు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అలాగే బంగారం దిగుమతులను తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ గోల్డ్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుత మార్కెట్ రేట్ల ప్రకారం 999.9 స్వచ్ఛతతో 24కే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారాన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ అంటే బంగారంలో పెట్టుబడి పెట్టే ఆధునిక పద్ధతి. ఈ పద్ధతి ద్వారా పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితంగా కొనుగోలు చేయవచ్చు. అలాగే విక్రయించవచ్చు.

డిజిటల్ బంగారానికి సంబంధించిన ప్రతి యూనిట్ నిర్దిష్ట పరిమాణానికి సమానమైన నిజమైన బంగారానికి నిజమైన విలువకు మద్దతు ఇస్తుంది. డిజిటల్ బంగారం భారతదేశంలో ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్‌మంట్, సేఫ్ గోల్డ్ వంటి సంస్థల ద్వారా అందుబాటులో ఉంది. ఆర్థిక సంస్థలు, బ్రోకరేజ్ సంస్థలు, మొబైల్ ఈ-వాలెట్‌ల ద్వారా డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. అసలు బంగారం మార్కెట్ ధర ఈ పెట్టుబడిపై రాబడిని నిర్ణయిస్తుంది. అయితే డిజిటల్ బంగారంపై పూర్తిగా బీమా ఉంటుంది. ఎంఎంటీసీ రహిత పీఏఎంపీ మీ బంగారాన్ని ఐదేళ్లపాటు నిల్వ చేస్తుంది. గూగుల్ పే ద్వారా ఎంఎంటీసీ పీఏఎంపీ బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ పే ఎంఎంటీసీ పీఏఎంపీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయడానికి, నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చెల్లింపుల పద్ధతుల ద్వారా డిజిటల్ గోల్డ్‌ను కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

గూగుల్ పే ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు

  • గూగుల్ పే యాప్‌ను తెరవాలి. 
  • సెర్చ్ బార్‌లో “గోల్డ్ లాకర్” సెర్చ్ చేసి గోల్డ్ లాకర్‌ను ఎంచుకోవాలి. 
  • అక్కడ మీకు బంగారం ప్రస్తుత మార్కెట్ కొనుగోలు ధర (పన్నుతో సహా) కనిపిస్తుంది. మీరు కొనుగోలు ప్రారంభించిన తర్వాత ఈ ధర 5 నిమిషాల పాటు లాక్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే కొనుగోలు ధర రోజంతా మారవచ్చు. 
  • మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న బంగారం మొత్తాన్ని విలువను నమోదు చేయాలి. అయితే మీరు కొనుగోలు చేయగల బంగారం మొత్తం విలువపై మొత్తం పరిమితి లేదు. అయితే, మీరు ఒక రోజులో రూ. 50,000 రోజువారీ పరిమితిలో మాత్రమే బంగారం కొనుగోలు చేయవచ్చు. 
  • అనంతరం డిస్‌ప్లే అయిన విండోలో మీకు ఇష్టమైన చెల్లింపు పద్ధతిని ఎంచుకుని సొమ్ము పే చేయాలి. అనంతరం కొన్ని నిమిషాల్లో బంగారం మీ లాకర్‌లో కనిపిస్తుంది. ఈ సదుపాయం అంతర్గత బ్రాండ్ కింద లేదా డిజిటల్ గోల్డ్ బ్రాండ్‌తో భాగస్వామ్యంతో అందిస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..