కారు, బైక్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ గుడ్‌ న్యూస్‌ మీకోసమే..!

కారు, ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఐఆర్డీఏ శుభవార్త తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కారు, బైక్ ధరలు తగ్గనున్నాయి. ఇందుకు కారణం.. ఇవాళ్టి (ఆగస్టు 1వ తేదీ) నుంచి దేశ వ్యాప్తంగా..

కారు, బైక్‌ కొనాలనుకుంటున్నారా..? ఈ గుడ్‌ న్యూస్‌ మీకోసమే..!

కారు, ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఐఆర్డీఏ శుభవార్త తెలిపింది. ఆగస్టు 1వ తేదీ నుంచి కారు, బైక్ ధరలు తగ్గనున్నాయి. ఇందుకు కారణం.. ఇవాళ్టి (ఆగస్టు 1వ తేదీ) నుంచి దేశ వ్యాప్తంగా న్యూ ఇన్సూరెన్స్‌ రూల్స్‌ అమల్లోకి రానున్నాయి. దీంతో వాహనాల ధరల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. న్యూ రూల్స్‌ ప్రకారం.. ఇప్పటి వరకు ఉన్న లాంగ్ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్స్‌ను బీమా కంపెనీలు ఉపసంహరించుకున్నాయి. ఇప్పటి వరకు ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్‌ ద్వారా కొనుగోలు దారుడు పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అందుకు కారణం.. మూడు నుంచి ఐదు సంవత్సరాల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్‌ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్స్‌ను బీమా కంపెనీలు ఉపసంహరించుకోవడంతో.. ఇక నుంచి ఒక ఏడాదికి వాహన బీమాను తీసుకోవచ్చు. దీంతో కస్టమర్‌కు పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్‌ డబ్బులు మిగలనున్నాయి.

దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఆదేశాలు జారీ చేసింది. న్యూ రూల్స్‌ ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ తర్వాత వాహనాలు కొనుగోలు చేసే వారికి ఈ రూల్ వర్తించనుంది. దీంతో ఏడాది ఇన్సూరెన్స్‌ తీసుకుని.. ఆ తర్వాత ఇష్టమైన బీమా కంపెనీతో రిన్యూవల్‌ చేసుకుంటే సరిపోతుంది.

Read More

ముందు ఉల్లి బస్తాలు.. వెనుక గంజాయి బస్తాలు

రాజౌరీ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు.. జవాన్‌ వీరమరణం

ఢిల్లీలో కేసుల కంటే పెరిగిన రికవరీలు

Click on your DTH Provider to Add TV9 Telugu