వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఏసీ వాడకం ఒకటే సరైన మార్గం. అయితే ఏసీ కొనడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. దీని వినియోగానికి కరెంట్ బిల్లు కూడా వాచిపోతుంది. అయితే ఈ రెండు సమస్యలకు చెక్‌పెడుతూ.. సరికొత్త ఏసీలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాటినే పోర్టబుల్ ఏసీలుగా పిలుస్తుంటారు. ఈ పోర్టబుల్ ఏసీల ధర తక్కువ, అలాగే కరెంట్ వినియోగం కూడా కనిష్టంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. కొన్ని గంటల వరకు పని చేస్తాయి. తద్వారా కరెంట్ ఖర్చును తగ్గించుకోవచ్చు. మరి లేట్ ఎందుకు వాటిల్లో ఓ పోర్టబుల్ ఏసీని షార్ట్‌లిస్టు చేసి మీ ముందుకు తీసుకొచ్చేశాం. ఓసారి ఫీచర్లు తెలుసుకుందామా..
ఈ పోర్టబుల్ ఏసీ బరువు కేవలం 610 గ్రాములు. దీన్ని మీరు ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. ఇల్లు, ఆఫీస్, పిక్నిక్.. ఇలా ఎక్కడైనా వాడొచ్చు. ఇందులో నుంచి 32 డిసిబుల్స్ సౌండ్ వస్తుంది. యూఎస్‌బీ కేబుల్‌తో వచ్చే ఈ పోర్టబుల్ ఏసీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 4 గంటల పాటు చల్లటి గాలిని అందిస్తుంది. దీనికి 9 వోల్ట్‌ల కరెంట్ ఉపయోగపడుతుంది. కాగా, ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 3 వేల నుంచి 3,300 మధ్య ఉంటుంది.(Source)