AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Portable AC: కూల్ న్యూస్.! రూ. 10 వేలలోపే ఈ 3 పోర్టబుల్ ఏసీలు.. క్షణాల్లో ఇంటిని చల్లబరుస్తాయి..

వర్షం పడినా.. ఎలాంటి మార్పు లేదు.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతను తప్పించుకునేందుకు..

Portable AC: కూల్ న్యూస్.! రూ. 10 వేలలోపే ఈ 3 పోర్టబుల్ ఏసీలు.. క్షణాల్లో ఇంటిని చల్లబరుస్తాయి..
Portable Acs
Ravi Kiran
|

Updated on: Jun 02, 2023 | 11:58 AM

Share

వర్షం పడినా.. ఎలాంటి మార్పు లేదు.. పగటిపూట ఉష్ణోగ్రతలు మళ్లీ 42 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. వేడి, ఉక్కపోతను తప్పించుకునేందుకు జనాలు ఏసీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఏసీ కొనాలంటే.. చాలా డబ్బుతో కూడుకున్న విషయం. అంతేకాదు.. ఒక్కసారి ఆన్ చేస్తే చాలు.. కరెంట్ బిల్లు గిర్రున తిరిగి.. మన తలబొప్పి కట్టేలా వస్తుంది. అందుకోసమే మార్కెట్‌లోకి పోర్టబుల్ ఏసీలు వచ్చేశాయి. ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్లకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని నిమిషాల్లోనే మీ ఇంటిని చల్లబరుస్తాయి. కాంపాక్ట్, బరువులో తేలికైనందున, ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. పోర్టబుల్ ఏసీతో విద్యుత్ బిల్లు కూడా పెద్దగా రాదు. మరి రూ. 10 వేలలోపు మార్కెట్‌లో దొరికే పోర్టబుల్ ఏసీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

CEROBEAR రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీ:

ఈ పోర్టబుల్ ఏసీని ఎక్కడైనా పెట్టొచ్చు.. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఇందులో 3 స్పీడ్ టెక్నాలజీ ఉంది. మీరు కోరుకున్న విధంగా ఇందులో అమర్చబడిన ఫ్యాన్ వేగాన్ని పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు. ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. దీని ధర రూ. 11 వేలు. ప్రముఖ ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్‌లో ఇది రూ. 10 వేలకే లభిస్తోంది.

LaoTzi రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీ:

LaoTzi రీచార్జబుల్ పోర్టబుల్ ఏసీలో ఆనేక అద్భుత ఫీచర్లు ఉన్నాయి. ఇందులో కూడా 3 స్పీడ్ టెక్నాలజీ ఉంది. దీనిలో అమర్చిన నైట్ ఎల్‌ఈడీ లైట్లు 7 రంగులలో కాంతిని ప్రకాశిస్తాయి. యూఎస్‌బీ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. దీని ధర కూడా రూ. 10 వేలులోపే ఉంది.

షాలెక్ పోర్టబుల్ ఏసీ:

ఈ పోర్టబుల్ ఏసీని ఇంట్లో లేదా కార్యాలయంలో ఎక్కడైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇందులో 4000 mAh బ్యాటరీ ఉంది. క్షణాల్లో ఇల్లంతా చల్లబరుస్తుంది. దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ పోర్టబుల్ ఏసీ ధర రూ. 9 వేలు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!