Buy Now Pay Later: ఇంతకు ముందు ఏదైనా వస్తువు కోనాలనుకుంటే ముందు నుంచి డబ్బులు పోగు చేసి కొనుగోలు చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్లు, క్రెడిట్ కార్డుల ద్వారా దీన్ని కొనడం చాలా సులభంగా మారిపోయింది. ఇదే సమయంలో మరో అడుగు ముందుకు వేశాయి ఫిన్ టెక్ కంపెనీలు. బై నౌ, పే లేటర్ ఆప్షన్ ని ఏర్పాటు చేస్తున్నాయి. దీని ద్వారా ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువులకు కొన్ని రోజుల తర్వాత పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. వీలుంటుంది. ఈ ఆప్షన్ రెండు మూడు సంవత్సరాల క్రితమే అందుబాటులోకి వచ్చినా కోవిడ్-19 వల్ల ఈ ఆప్షన్ చాలా తెలిసిపోయింది. ఈ సంస్థలకు ఎక్కువగా టైర్ 2, టైర్ 3 సిటీల్లోనే వినియోగదారులున్నారట. జెస్ట్ మనీ సంస్థ తమ వినియోగదారుల్లో 68 శాతం మంది ఈ నగరాల్లో ఉన్నట్లు టైర్ 1 సిటీల్లో ఉన్నవారు కేవలం 32 శాతమే అని వెల్లడించింది.
జెస్ట్ మనీ నిర్వహించిన అధ్యయనం మేరకు ఈ పథకాన్ని ఎంచుకున్న వినియోగదారుల సగటు వయసు 34 సంవత్సరాలుగా ఉందట. ఈ పథకాన్ని చాలామంది వాటిని ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, ఖరీదైన స్మార్ట్ ఫోన్లను కొనడం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఫ్యాషన్ ఉత్పత్తుల కొనుగోలుతో పాటు ప్రయాణాలకు కూడా ఉపయోగించారట.
జెస్ట్ మనీ సీఈఓ లిజీ చాప్ మాన్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంతగా ఈ పథకాన్ని ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని అన్నారు. ఈ పథకం చాలామందికి నచ్చుతోందని అన్నారు. ఈ ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలకు చెందిన వారు ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. సగటు దేవీలను 43,000 గా ఉండడం విశేషం. కరోనా లాక్ డౌన్ వల్ల అవసరాలు పెరిగాయి. పరిస్థితుల్లో మార్పు వచ్చింది. దీంతో ఒక్కసారిగా పెట్టుబడి పెట్టకుండా ఇలా కొద్దిగా కట్టుకునే పద్ధతులను చాలామంది ఇష్టపడుతున్నారు.
ఈ స్కీమ్‌ల ద్వారా వస్తువులను ఇప్పుడు కొని భవిష్యత్తులో వాటి బిల్లు చెల్లించే వీలుంటుంది. దీనికి గాను ముందు ఓ ఫిన్ టెక్ కంపెనీలో ఎన్ రోల్ చేసుకున్న తర్వాత ఆ సంస్థ ఆఫర్ చేసే ఆన్‌లైన్ స్టోర్ల నుంచి వివిధ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత పదిహేను నుంచి నెల రోజుల తర్వాత మీరు ఆ వస్తువుకి సంబంధించిన బిల్లును చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఆ తర్వాత చెల్లిస్తే మాత్రం కొద్దిగా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ మీ బిల్ అమౌంట్‌ని బట్టి ఉంటుంది. మరీ ఎక్కువ ఖరీదు పెట్టి కొనే కొన్ని వస్తువులకు నో కాస్ట్ ఈఎంఐ రూపంలో కూడా చెల్లించే ఆప్షన్ ని కొన్ని సంస్థలు అందిస్తున్నాయి.
ఇందులో ఉన్న కొన్ని పాపులర్ సంస్థలుగా అమెజాన్ పే, ఈపే లేటర్, కిష్ట్, లేజీ పే, సింపుల్, జెస్ట్ మనీ వంటివి చెప్పుకోవచ్చు. వీటిని లాగిన్ అయ్యి మీరు వాటి సేవలను పొందవచ్చు. ఒకేసారి ఎక్కువ సంస్థల సేవలను కూడా పొందే వీలుంటుంది. లాగిన్ కాగానే మీ క్రెడిట్ ప్రొఫైల్ ని బట్టి మీకు కొంత క్రెడిట్ లిమిటెడ్‌ని ఆ సంస్థలు అందిస్తాయి. ఈ ఆప్షన్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్, బిగ్ బాస్కెట్ వంటి ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫాంలో అందుబాటులో ఉంది. వీటితో పాటు జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ యాప్స్, గో ఐబిబో, క్లియర్ ట్రిప్ వంటి ట్రావెల్ సంస్థల వద్ద కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సంస్థలు క్రెడిట్ కార్డు లేకుండానే క్రెడిట్ కార్డు అందించే సేవలను అందిస్తాయి.
మీరు గడువులోపు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వడ్డీ పడుతుంది. ఒక్కో సంస్థ ఒక్కో విధంగా వడ్డీ రేటు వేస్తుంది. ఏడాదికి 21 శాతం నుంచి 36 శాతం వరకు ఉంటుంది. ఇలా ఆలస్యంగా చెల్లిస్తే భవిష్యత్తులో తీసుకునే లోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.