
ఈ పండగక్కి మీరు కొత్త టీవి కొనాలని చూస్తున్నారా..? అయితే, ఇది మీకు సువర్ణావకాశం.. తక్కువ ధరకు 55 అంగుళాల స్మార్ట్ LED టీవీని కొనుగోలు చేయడానికి ఇది ఒక గొప్ప అవకాశం. స్మార్ట్ టీవీలతో సహా ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో 32 అంగుళాల టీవీ ధరకే 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు. TCL, Realme, Sony, Foxconn వంటి బ్రాండ్‌ల నుండి స్మార్ట్ టీవీలను 74శాతం వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ పెద్ద స్క్రీన్ స్మార్ట్ టీవీలను రూ.25,000 కంటే తక్కువ ధరకు మీ ఇంటికి తీసుకురావచ్చు. ఆయా టీవీల ధరలు ఎంత తగ్గింపుతో వస్తున్నాయో ఇక్కడ చూద్దాం…
సోనీ బ్రావియా 55–అంగుళాల LED స్మార్ట్ టీవీని 36శాతం తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.57,990కి లభిస్తుంది. కానీ, దీని అసలు ధర రూ.91,900. దీని లక్షణాలలో 40W స్పీకర్ కూడా ఉంది. ఇది Google Android ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది.
TCL 55-అంగుళాల LED స్మార్ట్ టీవీ ధరలో 64శాతం తగ్గింపు ఉంది. ఈ స్మార్ట్ టీవీ రూ.32,990 కు లభిస్తుంది. కానీ, దీని అసలు ధర రూ.93,999. మీరు ఈ టీవీపై రూ.6,500 వరకు ఆదా చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 24W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీపై కంపెనీ రెండేళ్ల వారంటీని అందిస్తోంది.
Realme TechLife 55-అంగుళాల QLED స్మార్ట్ టీవీని కేవలం రూ.27,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీ 57శాతం తగ్గింపుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.65,399. ఈ టీవీ కొనుగోలుతో రూ.6,500 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఫాక్స్‌కాన్ బ్రాండ్ నుండి 55-అంగుళాల QLED అల్ట్రా HD స్మార్ట్ టీవీ కేవలం రూ.24,999కే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ధర 74శాతం వరకు తగ్గింది. దీని అసలు ధర రూ.98,990. ఇది Google Android TV ప్లాట్‌ఫామ్‌పై నడుస్తుంది. 30W స్పీకర్‌ను కలిగి ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి