Business Idea: బాగా డబ్బులు సంపాదించేందుకు ఎన్నో మార్గాలున్నాయి. అయితే కొన్నింటిలో మంచి రాబడి వస్తుంది. కొన్నింటిలో తక్కువ రాబడి వస్తుంటుంది. మనం ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి రాబడి పొందవచ్చు. డబ్బులు సంపాదించేందుకు రకరకాల వ్యాపారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆధారం పొందవచ్చు. ఇందులో భాగంగా డబ్బులు సంపాదించే వారికి ఓ మంచి అవకాశం ఉంది. బ్యాంబో చెట్ల పెంపకం ద్వారా అదిరిపోయే బెనిఫిట్స్ పొందవచ్చు. బ్యాంబోను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. రైతులు లక్షాధికారులు కావాలంటే ఈ చెట్లను పెంచవచ్చు. అయితే పరిశ్రమల్లో, ఫర్నీచర్ ఇండస్ట్రీలో వెదురు చెట్లను ఉపయోగిస్తారు. గ్రీన్ గోల్డ్ పెంపకం ద్వారా మీరు లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెదురు చెట్ల పెంపకానికి సబ్సిడీ కూడా అందిస్తోంది. ఒక్కో చెట్టుకు రూ.120 సబ్సిడీ అందిస్తోంది.
కాగా, దేశంలో బ్యాంబో చెట్లకు డిమాండ్ కూడా అధికంగా ఉంది. అందువల్ల మీరు ఈ చెట్లను పెంచితే మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ చెట్లను నాటితే 4 సంవత్సరాల తర్వాత నుంచి లాభాలు పొందవచ్చు. అలాగే ప్రతిసారి ఈ చెట్లను నాటాల్సిన పని ఉండదు. ఒక్కసారి నాటితే 40 ఏళ్లు రాబడి పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ బ్యాంబో చెట్లలో 136 రకాలు ఉంటాయి. అందువల్ల మీరు మంచి రకాన్ని ఎంచుకుని పెంచితే మంచి ఆదాయం పొందవచ్చు. ఒక హెక్టార్‌లో 1500 మొక్కలను నాటవచ్చు. ఒక్కో మొక్కు ఐదు అడుగుల దూరం ఉండాలి. నాలుగేళ్ల తర్వాత నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు పొందవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి బిజినెస్ చేసేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అధిక రాబడి వచ్చే బిజినెస్‌లను చేసే వారి కోసం ప్రభుత్వాలు కూడా రుణాలు, సబ్సిడీ వంటివి అందిస్తున్నాయి. అందుకే కొత్త కొత్త బిజినెస్ లను ఎంచుకోవడం మంచిది.