Bulk Purchase: బల్క్ కొనుగోలు వల్ల ప్రయోజనం ఏమిటి?.. ఖర్చులను ఆదా చేసుకోవడం ఎలా..?

|

Mar 12, 2023 | 1:17 PM

ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు నెలవారీ రేషన్‌, ఇతర వస్తువులు కూడా చాలా అవసరమై ఉంటాయి. కొన్ని సార్లు వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తుంటారు. మరికొన్ని స్టోర్ల నుంచి..

Bulk Purchase: బల్క్ కొనుగోలు వల్ల ప్రయోజనం ఏమిటి?.. ఖర్చులను ఆదా చేసుకోవడం ఎలా..?
Bulk Purchase
Follow us on

ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు నెలవారీ రేషన్‌, ఇతర వస్తువులు కూడా చాలా అవసరమై ఉంటాయి. కొన్ని సార్లు వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తుంటారు. మరికొన్ని స్టోర్ల నుంచి కొనుగోలు చేస్తుంటారు. పదేపదే ఆర్డర్ చేసినప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. ఇలా చేయడం మానసికంగా, శారీరకంగానూ శ్రమ కలిగిస్తుంది. పెద్ద కుటుంబం ఉంటే రేషన్‌తో పాటు నిత్యవసర వస్తువుల కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డబ్బులు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. రోజు వారీ అవాంతరాలకు పరిష్కారం బల్క్‌గా కొనుగోలు చేయడమే. దీని అర్థం మీరు ఒకేసారి భారీ మొత్తంలో కొనుగోలు చేయడం అన్నట్లు. సాధారణంగా మీరు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు కొంత డబ్బును ఆదా చేసుకోవచ్చు. మీ ఇంట్లో స్థలం ఉంటే ఒకేసారి పెద్ద మొత్తంలో వస్తువులను కొనుగోలు చేయడం ఉత్తమం. డబ్బు ఆదా చేయడానికి మీరు పెద్దమొత్తంలో కొనుగోలు చేయవచ్చు. మీరు పెద్దమొత్తంలో కొనుగోలు చేసే దుకాణం లేదా హోల్‌సేల్ షాపు నుంచి నుంచి చేయవచ్చు. లేదా బల్క్ కొనుగోళ్లపై తగ్గింపు ఇచ్చే స్థానిక సూపర్ మార్కెట్‌ స్టోర్స్‌ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు Dmart, Vishal Mega Mart, Reliance Smart, Smart Bazaar వంటి హైపర్‌లోకల్ స్టోర్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల కొంత ఖర్చు ఆదా అవుతుంది.

ఇప్పుడు మనం పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం. మీరు మీ ఇంట్లో 10 లీటర్ల మంచినూనె వాడతారని అనుకుంందాం.. మీరు 10 లీటర్ల నూనె ప్యాక్‌ను ఒకేసారి తీసుకోవడం, 1 లీటర్‌ ప్యాక్‌లు 10 కొనుగోలు చేయడం, లేదా 5 లీటర్‌ లీటర్‌లు ఉన్న ప్యాక్‌లు రెండు కొనుగోలు చేయడం చేయవచ్చు. 1లీటర్ ప్యాక్ ధర 170 రూపాయలు. అయితే 10 ప్యాక్‌ల ధర 1700 రూపాయలు అవుతుంది. మీరు పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తే, దుకాణదారుడు మీకు కనీసం 10శాతం తగ్గింపు ఇస్తాడు. దీనికి మీకు మొత్తం 1500 రూపాయలు ఖర్చు అవుతుంది. అదేవిధంగా, 5-లీటర్, 10-లీటర్ ప్యాక్‌లు కూడా చౌకగా లభిస్తాయి.

ఇలా బల్క్ కొనుగోలు చేయడం వల్ల మీ నెలవారీ ఖర్చులో కొంత ఆదా చేసుకోవచ్చు. మీరు ఒక నెలకు సరిపడ నిత్యవసర వస్తువుల జాబితాను తయారు చేసుకుని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తే కొంత పొదుపు చేసుకోవచ్చు. వృధాగా పోయే ఖర్చులను నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

అలాగే పెద్దమొత్తంలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. ఒకేసారి ప్యాకేజింగ్‌ కారణంగా ప్లాస్టిక్‌ వ్యర్థాలను తగ్గించుకోవడమే కాకుండా పర్యావరణానికి హాని కలుగకుండా ఉంటుంది. అలాగే మీరు చిటికిమాటికి స్టోర్‌లకు వెళ్లి కొనుగోలు చేసే బాధ తప్పుతుంది. ఒకేసారి కొనుగోలు చేయడం వల్ల లాక్‌డౌన్‌, ఏదైనా కారణంగా స్టోర్లు బంద్‌ ఉన్న సమయాల్లో నెల లేదా రెండు నెలల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

మీరు ఒకటి లేదా 2 నెలల పాటు స్టాక్‌ని ఉంచుకున్నట్లయితే వాటి ధరలు పెరిగినా.. కొంత సమయం వరకు మిమ్మల్ని ప్రభావితం చేయదు. సో.. పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము. మీకు పెద్ద కుటుంబం ఉంటే ఒకేసారి కొనుగోలు చేయడం వల్ల బడ్జెట్‌లో కూడా సహాయపడుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి