Electric Scooters: అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..ఓ లుక్కెయ్యండి

| Edited By: Anil kumar poka

Dec 25, 2022 | 6:10 PM

ఎలక్ట్రిక్ బైక్ వాడితే పర్యావరణ పరిరక్షణతో పాటు మన జేబుకు కూడా చిల్లు పడకుండా జాగ్రత్త పడవచ్చని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. ఈ ధోరణితో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు తారాస్థాయికి చేరింది.

Electric Scooters: అదిరిపోయే ఫీచర్లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..ఓ లుక్కెయ్యండి
Electric Scooters
Follow us on

పెరుగుతున్న ఇందన ధరల దెబ్బకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్ వాడితే పర్యావరణ పరిరక్షణతో పాటు మన జేబుకు కూడా చిల్లు పడకుండా జాగ్రత్త పడవచ్చని సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. ఈ ధోరణితో ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు తారాస్థాయికి చేరింది. ప్రతి ఏడాది అమ్మకాల విషయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ తన మార్క్ ను చూపిస్తున్నాయి. అయితే సామాన్యుడికి మాత్రం కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రమే తన బడ్జెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. భారతదేశంలో సామాన్యుడికి అందుబాటులో ధరల్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లపై లుక్కేద్దాం.

బౌన్స్ ఇన్ ఫినిటీ ఈ-1

ఈ బైక్ ధర రూ.45, 099 గా ఉంది. ఇందులో IP67-రేటెడ్ లిథియం-అయాన్ బ్యాటరీని వాడారు. దీన్ని చార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఓ సారి చార్జ్ చేస్తే 80 కి.మి వరకూ తిరొగచ్చు. దీన్ని గరిష్ట స్పీడ్ గంటకు 65 కి.మి. ఇందులో ఎకో, స్పీడ్ అనే రెండు మోడ్స్ లో డ్రైవింగ్ ను ఎక్స్ పీరియన్స్ చేయవచ్చు. ఇన్ఫినిటీ E1 బ్లూటూత్ కనెక్టివిటీ, జియోఫెన్సింగ్, యాంటీ-థెఫ్ట్ హెచ్చరికలతో పాటు డ్రాగ్ మోడ్‌తో వస్తుంది. ఇది పంక్చర్ అయినప్పుడు స్కూటర్‌ను తరలించడానికి వీలుగా ఉంటుంది. 

హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా సీఎక్స్

550 W బీఎల్ డీసీ మోటర్ తో పని చేసే ఈ బైక్ ధర రూ.62,190.  ఇది 52.2V, 30Ah లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీతో వస్తుంది. దీన్ని చార్జ్ చేయడానికి 4-5 గంటల సమయం పడుతుంది. ఈ బైక్ లో డబుల్ బ్యాటరీ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ.77,490. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 45 కిలో మీటర్లు.

ఇవి కూడా చదవండి

ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్

ఈ బైక్ ఎల్ సీడీ స్క్రీన్, ఇంటిగ్రేటెడ్ యూఎస్ బీ సపోర్ట్, కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంతో వస్తుంది. దీని ధర రూ.73,999 గా ఉంది. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 55 కిలో మీటర్లు. ఈ బైక్ ను చార్జ్ చేయడానికి 6-7 గంటలు పడుతుంది. 

హీరో ఎలక్ట్రిక్ పోటాన్

ఈ బైక్ రూ.80,790 రేంజ్ లో అందుబాటులో ఉంది. 1200W మోటార్‌తో, 72V 26 Ah బ్యాటరీతో వచ్చే ఈ బైక్ చార్జ్ చేయడానికి 5 గంటలు పడుతుంది. ఓ సారి చార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 45 కిలో మీటర్లు. ఎల్ ఈ డీ హెడ్ లైట్, అలాయ్ వీల్స్ తో వినియోగదారులకు అందుబాటులో ఉంది. 

ఒకినివా ప్రైజ్ ప్రో

ఈ బైక్ 2kWh లిథియం-అయాన్ రిమూవబుల్ బ్యాటరీతో, 1kW బీఎల్డీసీ మోటార్ తో వస్తుంది. ఈ బైక్ ధర రూ.87, 593. గరిష్ట వేగం 55 కి.మి. ఓ సారి చార్జ్ చేస్తే 80 కి.మి వరకూ వెళ్తుంది. ఈ బైక్ ను చార్జ్ చేయడానికి 2-3 గంటల సమయం పడుతుంది. కీలెస్ ఎంట్రీ, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్ వంటి పీచర్లు ఈ బైక్ సొంతం. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..