Budget 2023: బడ్జెట్‌ లైవ్‌ను ఎలా చూడాలి..? వార్షిక బడ్జెట్‌ ప్రతులను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?

|

Feb 01, 2023 | 10:46 AM

కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న..

Budget 2023: బడ్జెట్‌ లైవ్‌ను ఎలా చూడాలి..? వార్షిక బడ్జెట్‌ ప్రతులను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..?
Budget Papers
Follow us on

కేంద్ర బడ్జెట్‌ రాబోతోంది. ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వచ్చే ఏడాది లోక్‍సభ ఎన్నికల ముందు బీజేపీ నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్‌ ఇది. మోడీ సర్కార్‌కు ఇది చివరి బడ్జెట్‌ కావడంతో అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్‌పై ఎంతో మంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. జనవరి 31వ తేదీన పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. అదే రోజు ఎకనమిక్ సర్వే సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాతి రోజు బడ్జెట్ ఉంటుంది. 2023-24 కేంద్ర బడ్జెట్ ఏ సమయానికి మొదలవుతుంది..? బడ్జెట్‌ పేపర్లను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి..? అనే విషయాలు తెలుసుకుందాం.

  1. బడ్జెట్‌ సమయం: 2023-24 ఆర్థిక సంవత్సరానికి మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రారంభం అవుతుంది. మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్ట బడ్జెట్‌ సుమారు 2 గంటల పాటు ఉండనుంది.
  2. బడ్జెట్‌ను ఎక్కడ చూడవచ్చు..: ఈ యూనియన్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని లైవ్‌లో కూడా చూడవచ్చు. బడ్జెట్‌ ప్రసంగం ప్రభుత్వ ఛానెల్‌ సన్‌సద్‌లో పూర్తిగా చూడవచ్చు. అలాగేప్రైవేట్ బ్రాడ్‍కాస్టింగ్ టీవీ చానెల్స్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. అలాగే అనేక డిజిటల్ న్యూస్ ప్లాట్‍ఫామ్‍లో కూడా లైవ్ ఉంటుంది.
  3. బడ్జెట్‌ ప్రతులను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఎలా..? ఈ బడ్జెట్‌ ప్రతులను మీ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ మొబైళ్లలో ‘యూనియన్‌ బడ్జెట్‌ మొబైల్‌ యాప్‌’లో ఈ బడ్జెట్‌ ప్రతులను డౌన్‌లోడ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది కేంద్రం. అలాగే ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ మొబైళ్లు వాడుతున్న వారు యాపిల్‌ స్టోర్‌ ద్వారా కూడా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుని బడ్జెట్‌ పేపర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
  4. బడ్జెట్‌ పేపర్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి..? ఈ యూనియన్‌ బడ్జెట్‌ పేపర్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రసంగం అయిన తర్వాత అందుబాటులో ఉంటాయి. అప్పుడు డౌన్‍లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ బడ్జెట్‌ ప్రతులు హిందీ, ఇంగ్లీష్‌లో ఉంటాయి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి