గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం..

| Edited By: Ravi Kiran

Feb 01, 2023 | 11:29 AM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. మోదీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఈ సారి మరింత ఆసక్తి నెలకొంది..

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయనున్న కేంద్రం..
ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లో మండే వాయువు ఉంటుంది. అందుకే సిలిండర్ అంటేనే ప్రమాదకరం. వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లు ఎరుపు రంగులో ఉంటాయి. ఎందుకంటే ఎరుపు రంగును హెచ్చరిక చిహ్నంగా భావిస్తారు.
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. మోదీ సర్కార్‌కు ఇదే చివరి బడ్జెట్ కావడంతో ఈ సారి మరింత ఆసక్తి నెలకొంది. పైగా 2024 లోక్‌సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్‌ సామాన్యుడిని ఊరిస్తోంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్లకు సబ్సిడీ భారీగా పెరగనున్నట్లు సర్వత్రా భావిస్తున్నారు. అంతేకాకుండా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పెరిగిన గ్యాస్‌ ధరల దృష్ట్యా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులు కొత్త బడ్జెట్‌పై కోటి ఆశలు పెట్టుకున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.5,812 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద ఏడాదికి 12 సిలిండర్లకుగానూ సబ్సీడీని ప్రకటించింది. సబ్సిడీలో భాగంగా ఎల్పీజీ సిలిండర్‌కు రూ.200 అందిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద దాదాపు 9 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందుతున్నారు. రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కూడా ఈ గ్రాంట్‌ను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. వంద శాతంమేర దేశ జనాభాకు ఈ పథకం చేరువయ్యేలా కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఏయే ప్రయోజనాలు పొందొచ్చంటే..

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇస్తారు. ఇందుకోసం వారికి రూ.1,600 ఆర్థిక సహాయంతోపాటు రీఫిల్, స్టవ్ ఉచితంగా అందజేస్తారు. రూ.200ల సబ్సీడీ, ఏడాదికి 12 సిలిండర్లు అందజేస్తారు. కాగా మోదీ సర్కార్‌ 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించింది. ఉజ్వల 2.0ను 2021,ఆగస్టు 10న ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగతా కుటుంబాలకు కూడా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.