BSNL: ప్రత్యేక ఆఫర్‌ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

BSNL Plan: బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల కోసం తీసుకువచ్చిన ప్రత్యేక ఆఫర్ ను పొడిగించింది. కస్టమర్ల అద్భుతమైన స్పందన, ఉత్సాహం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు BSNL తెలిపింది. ఆగస్టులో సకాలంలో ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన వినియోగదారులకు కూడా ఈ అదనపు 15 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి..

BSNL: ప్రత్యేక ఆఫర్‌ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌
గత ఏడాది సెప్టెంబర్‌లో అత్యధిక మంది కస్టమర్లను జోడించడంలో BSNL అన్ని ఇతర కంపెనీలను అధిగమించింది. ఆ సమయంలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచాయి. దీని కారణంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లు ప్రైవేట్ కంపెనీలను విడిచిపెట్టి BSNLలో చేరారు.

Updated on: Sep 04, 2025 | 11:02 AM

BSNL తన రూ.1 ఫ్రీడమ్ ఆఫర్ చెల్లుబాటును మరో 15 రోజులు పొడిగించింది. అంటే ఈ ప్లాన్‌ను ఇప్పుడు సెప్టెంబర్ 15 వరకు రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ డేటా అపరిమిత కాల్స్, SMS లతో పాటు ఉచిత సిమ్‌ను అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా BSNL ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీనిని ఇప్పుడు మరో 15 రోజులు పొడిగించింది. ఇప్పుడు వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ఆఫర్‌ను సెప్టెంబర్ 15 వరకు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ధర రూ.1. ఈ ప్లాన్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: Zomato: కేవలం రూ. 2 పెరుగుదల.. కానీ లాభం రూ.15 కోట్లు.. జొమాటో గేమ్ ప్లాన్!

15 రోజుల అదనపు చెల్లుబాటు ఎందుకు?

ఇవి కూడా చదవండి

కస్టమర్ల అద్భుతమైన స్పందన, ఉత్సాహం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు BSNL తెలిపింది. ఆగస్టులో సకాలంలో ప్రక్రియను పూర్తి చేయలేకపోయిన వినియోగదారులకు కూడా ఈ అదనపు 15 రోజులు ఉపయోగకరంగా ఉంటాయి.

ఆఫర్ ప్రయోజనాలు:

ఈ ప్రత్యేక ఆఫర్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు చాలా అద్భుతమైన సౌకర్యాలను అందిస్తోంది. వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్, 100 ఉచిత SMSలను పొందుతారు. దీనితో పాటు కస్టమర్లకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్‌లు, రీఛార్జ్ బోనస్, MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్ నుండి సులభమైన యాక్టివేషన్ సౌకర్యం కూడా అందించనుంది.

ఎలా యాక్టివేట్ చేయాలి?

మొదటి పద్ధతి: మీరు BSNL వినియోగదారు అయితే, ఈ ప్రత్యేక ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ ప్రక్రియ చాలా సులభం. ముందుగా MyBSNL యాప్ లేదా BSNL సెల్ఫ్‌కేర్ పోర్టల్‌లోకి లాగిన్ అయి అక్కడ నుండి “ఫ్రీడమ్ ఆఫర్” ఎంపికను ఎంచుకోండి. దీని తర్వాత, మీరు రూ.1 మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ పూర్తయిన వెంటనే, 2GB డేటా, అపరిమిత కాలింగ్ సౌకర్యం మీ నంబర్‌లో వెంటనే యాక్టివేట్ అవుతుంది.

రెండవ పద్ధతి: దీనితో పాటు కస్టమర్లు USSD కోడ్ ఉపయోగించి కూడా ఈ ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీ మొబైల్ నుండి BSNL సూచించిన షార్ట్ కోడ్‌ను డయల్ చేయండి. ఆఫర్ వెంటనే ప్రారంభమవుతుంది.

ఈ ప్లాన్ నిజంగా 30 రోజులు ఉచితం?

ఇది మొదటి 30 రోజులు పూర్తిగా ఉచితం. సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి మీరు రూ. 1 టోకెన్ ఫీజు చెల్లించాలి. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత మీకు నచ్చిన ఏదైనా సాధారణ BSNL రీఛార్జ్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. నంబర్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చు.

ఇది కూడా చదవండి: Slimmest Smartphone: ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌.. నేడు భారత్‌లో విడుదల

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి