Recharge Plan: కేవలం రూ.1కే ఒక నెల రీఛార్జ్ ఫ్రీ.. భలే చీప్ ప్లాన్.. మార్కెట్‌ను తలదన్నేలా ఆఫర్

ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ తలదన్నే ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1 ఫ్రీడమ్ ప్లాన్‌ను మళ్లీ తెచ్చింది. ఈ ప్లాన్‌తో కేవలం ఒక రూపాయికే నెల రోజుల పాటు ఫ్రీగా కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే 2జీబీ డేటా కూడా వస్తుంది. ప్లాన్ వివరాలు ఇవే..

Recharge Plan: కేవలం రూ.1కే ఒక నెల రీఛార్జ్ ఫ్రీ.. భలే చీప్ ప్లాన్..  మార్కెట్‌ను తలదన్నేలా ఆఫర్
Mobile Recharge

Updated on: Dec 02, 2025 | 8:40 AM

BSNL Offer: ఎయిర్‌టెల్, జియో లాంటి టెలికాం కంపెనీలు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. వాటిని తట్టుకుని మిగతా కంపెనీలు ముందుకెళ్లడం సవాల్‌గానే మారింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. టెక్నాలజీలో అప్‌గ్రేడ్ అవ్వకపోవడం, సెల్ టవర్లను అన్ని ప్రాంతాలకు విస్తరించకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్ లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. తిరిగి వారిని రాబట్టుకునేందుకు ఆఫర్లు ప్రకటిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ధరలు మిగతావాటితో పోలిస్తే తక్కువగా ఉండటం, 5జీ నెట్‌వర్క్ కూడా వస్తుండటంతో చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఇప్పుడిప్పుడే దానికి వినియోగదారులు పెరుగుతూ వస్తు్న్నారు.

రూ.1కే నెల ఫ్రీ

తాజాగా కొత్త కస్టమర్లను తెచ్చుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ ఒకటి అందుబాటులోకి తెచ్చింది. అందేంటి అంటే రూ.1 ఫ్రీడమ్ ప్లాన్. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆ తర్వాత దీపావళి సందర్బంగా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు మరోసారి అదే ఆఫర్‌ను తీసుకొచ్చింది. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా సిమ్ తీసుకునేవారికి ఇది వర్తించనంది. సిమ్ ఉచితంగా ఇవ్వడంతో పాటు రూ.1కే ఒక నెల రీచార్జ్ వస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పంపుకునే సౌకర్యం లభిస్తుంది. ఎక్కువమంది ఈ ప్లాన్‌ను కోరుకోవడంతో తిరిగి తెచ్చినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో స్పష్టం చేసింది.

రూ.199 ప్లాన్

ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ రూ.199 ప్లాన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా.. అన్ లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు . ఇక రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చు.